ఆ గ్రామాలకు బస్సుల్లేవ్

అదిలాబాద్, ఫిబ్రవరి 8, (way2newstv.com)
నేరడిగొండ మండలంలోని బొందిడి, వడూర్, కుంటాల, వేంకటపూర్, బుగ్గారం, సావర్‌గాం, లింగాట్ల, ఆరెపెళ్లి, గ్రామాల ప్రజలు మండల కేంద్రంతో పాటు, నిర్మల్, ఆదిలాబాద్, హైదరాబాద్ పట్టణాలకు వివిధ పనుల నిమిత్తం నిత్యం వందల సంఖ్యలో మండల కేంద్రానికి వస్తుంటారు. బస్సు సౌకర్యం లేక ప్రయాణికులు ప్రయివేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అధికారులకు ఎన్ని సార్లు వినవించుకున్న పట్టించుకోకపోవడంతో మండల ప్రజల కష్టలు తిరడంలేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.


 ఆ గ్రామాలకు బస్సుల్లేవ్

 గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు 70శాతం గ్రామాలకు తారు రోడ్లు నిర్మించారు. పల్లెల నుంచి పట్టణానికి ఉన్నత చదువుకు వెళ్లే విద్యార్థులతో పాటు ఇతర గ్రామాలకు వెళ్లే వారికి బస్సులు లేక ప్రైవేటు వాహనాల్లోనే వెళ్లక తప్పడం లేదు.ఆరేపెళ్లి, లింగాట్ల కొర్టికల్ గ్రామాల మీదుగా నాలుగులైన్ల జాతీయ రహదారి గత తొమ్మిది సంవత్సరాల క్రితం పూర్తైంది, ఈ గ్రామాలకు రోడ్డు ఉంది. కానీ బస్సులు తిరగవు, ఆ గ్రామాల ప్రజలు ప్రయివేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మండల కేంద్రాం నుంచి కుంటాల వాటర్‌పాల్స్ వరకు ఇటివలనే తారు రోడ్డు వేశారు. వడూర్, బొందిడి గ్రామాలకు గత 4 సంవత్సరాల ముందు ఈ రోడ్డు మార్గం ద్వారా కొన్నాళ్ల పాటు బస్సు నడిపి సర్వీసు మద్యలో నిలిపివేశారు. ఇప్పటికైన ఆర్టిసి అధికారులు రోడ్లున్నా గ్రామాలకు బస్సుల నడపాలని కొరుతున్నారు.
Previous Post Next Post