జగన్ పై మండిపడ్డ సీఎం చంద్రబాబు

అమరావతి,ఫిబ్రవరి 7, (way2newstv.com)
వృద్ధాప్య పింఛన్ రూ. 3 వేలు చేస్తానన్న వైకాపా అధినేత జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. జగన్ ఓ సిద్ధాంతం లేని వ్యక్తి. ఆయన హామీలను ప్రజలు నమ్మరని అయన వ్యాఖ్యానించారు. గురువారం నాడు అయన పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.  బుధవారం ఎన్నికల సమర శంఖారావాన్ని పూరిస్తూ, వృద్ధాప్య పింఛన్లను రూ. 3 వేల వరకూ పెంచుతానని జగన్ చేసిన వ్యాఖ్యలపై అయన మండిపడ్డారు. చంద్రబాబు మాట్లాడుతూ ఓ సిద్ధాంతం లేని వ్యక్తి ఇస్తున్న తప్పుడు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.  


 జగన్ పై మండిపడ్డ సీఎం చంద్రబాబు

పార్టీ నేతలు, ముఖ్యలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో జగన్ కు దిక్కుతోచడం లేదని అన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీ, పక్క రాష్ట్ర సీఎం కేసీఆర్ లతో కుమ్మక్కైన జగన్, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. 
ఈ నెల 10వ తేదీన జరిగే మోదీ రాష్ట్ర పర్యటనపై టీడీపీ శ్రేణులు నిరసన తెలపాలని ఆదేశించారు.  11వ తేదీన ఢిల్లీలో ధర్మపోరాట దీక్షను పెద్దఎత్తున చేపట్టనున్నామని, ఎన్నో ప్రాంతీయ, జాతీయ పార్టీల నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పారు.  ఎన్నో ఏళ్ల బందరు పోర్టు కలను నేడు సాకారం చేస్తున్నామని, పోర్టు నిర్మాణ పనులకు ఈరోజు  శంకుస్థాపన జరుగుతుందని చంద్రబాబు చెప్పారు.
Previous Post Next Post