జంపు జిలానీలు ఎక్కువయ్యారు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జంపు జిలానీలు ఎక్కువయ్యారు

గుంటూరు, ఫిబ్రవరి 19, (way2newstv.com
ఎన్నికలు దగ్గరపడుతున్న టైములో ఆయారాం గయారాంలు ఎక్కువయ్యారు. స్వార్ధ రాజకీయాలకోసం పార్టీమారుతున్నారు తప్ప వేరే ఉద్దేశం లేదు. సాక్షిలో రవీంద్ర పై వచ్చిన వ్యతిరేక వార్తలపై రవీంద్ర ఏం సమాధానం చెప్తాడని మంత్రి నక్కా అనందబాబు ప్రశ్నించారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. కనీస నైతిక విలువలు లేని రాజకీయాలు చేస్తున్నాడు. 


జంపు జిలానీలు ఎక్కువయ్యారు

ఎంపి కాకముందు రవీంద్రబాబు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. కెసీఆర్, కెటిఆర్ లు వీళ్ళందరితో మాట్లాడి పార్టీ మార్పిస్తున్నారు. హైదరాబాదులో ఆస్తులు పోతాయని బయపడి పార్టీ మారుతున్నారు. ఏరు దాటాక తెప్ప తగలేసే రకాలు పార్టీ మారిన యంపిలని విమర్శించారు. చిత్తశుద్ధితో రాష్ట్ర హక్కులకోసం చంద్రబాబు పోరాడుతున్నారు. కేసీఆర్, జగన్ లు అక్కడ కూర్చొని రాజకీయ కుట్రలు చేస్తున్నారు. కేసుల నుండి బయటపడడానికి మోడీ, కేసిఆర్ కు జగన్ ఊడిగం చేస్తున్నాడు. లోటు బడ్జెట్ లో ఉన్నాకానీ చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. కులం గురించి మాట్లాడేవారు వైసీపిలో జగన్ చుట్టూ ఎవరు ఉంటారో చెప్పండని అన్నారు. జగన్ బిసిల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. జగన్ కి బిసిలలో ఎన్ని కులాలు ఉన్నాయో కూడా జగన్ కు తెలియదు. ఇడుపులపాయకు కూడా ఎస్సీ,ఎస్టీ నిధులు వాడుకున్న ఘనుడు జగన్ అని అయన అన్నారు. దమ్ముంటే కేసీఆర్, కేటిఆర్ ఆంద్ర వచ్చి జగన్ తో కలసి పోటీ చేయాలి. ఆంద్రప్రదేశ్ అంటే విషం కక్కే కేసీఆర్ తో జగన్ రాజకీయ కుట్రలు పన్నుతున్నాడని మంత్రి ఆరోపించారు.