మంత్రి తలసానిని అభినందించిన మేయర్ రామ్మోహన్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్

హైదరాబాద్, ఫిబ్రవరి 19  (way2newstv.com
హైదరాబాద్ నుండి మంత్రి వర్గంలో స్థానం పొందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ను నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ లు మంగళవారం కలిసి అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర మంత్రిగా పదవీ స్వీకారం చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్కు నక్లెస్ రోడ్లోని జలవిహార్ లో అభినందన సభ నిర్వహించారు.  


మంత్రి తలసానిని అభినందించిన మేయర్ రామ్మోహన్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్

ఈ సందర్భంగా నగర మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా రూపొందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహకారంతో పూర్తిస్థాయి అభివృద్దిని చేపట్టనున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసానికి మేయర్ రామ్మోహన్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్లు మొక్కలను బహూకరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో అంబర్ పేట్ కార్పొరేటర్ పులి జగన్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Previous Post Next Post