ఉన్నత విద్య తోనే ఉత్తమ సమాజం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె వి రమణాచారి
సచివాలయం  ఫిబ్రవరి 2 (way2newstv.com)
మానవీయ విలువల పరివ్యాప్తి లో ఉన్నత విద్య ఉత్తమ సమాజ స్థాపనకు నూతన దశ దిశను నిర్దేశించే   సాధనము అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అన్నారు.శనివారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని  డాక్టర్  రమణ చారి గారి ఛాంబర్లో  " ముదుగంటికి  ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా  సమాజ సేవ  సమాచార పరిజ్ఞాన పరివ్యప్తి లో విశేష సేవలు చేసిన .తెలంగాణ గ్రంధాలయ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ముదిగంటి సుధాకర్ రెడ్డి కి వారి కృషిని గుర్తించి  నేషనల్ వర్తువల్ యూనివర్సిటీ ఫర్ పీస్ &ఎడ్యుకేషన్ బంగలూర్  ఇచ్చిన  గౌరవ డాక్టరేట్  స్వచ్చంధ సేవా రంగాలకు   మని కిరీటం లాంటిదని రమణ చారి అన్నారు.

 
ఉన్నత విద్య తోనే ఉత్తమ సమాజం

ముదుగంటి గ్రంధాలయ విస్తరణ సేవల పరీవ్యప్తి అవినీతి నిర్మూల పర్యావరణ రక్షణ తెలంగాణ తొలి మలి ఉద్యమములో క్రియా శీలక పాత్ర పోషించి సమాజ చైతన్యమే ధ్యేయంగా  ఓటరు చైతన్యం పలు కార్యక్రమాలు చేపట్టి నిరంతర చైత్న్య శక్తి ముదుగంటి అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ముదుగంటి సుధాకర్ రెడ్డి నీ  రమణాచారి శాలువ తో సత్కరించారు ఈ కార్యక్రమంలో స్ఫూర్తి  స్వచ్చంధ సంస్థ అధ్యక్షుడు కొండూరు జగన్మోహన్ రావు తెలంగాణ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు నేదునూరి కనకయ్య  యునెస్కో అవార్డు గ్రహీతసత్య తిరునగరి పాల్గొన్నారు.  
Previous Post Next Post