తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సానియా మీర్జాను తొలగించాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సానియా మీర్జాను తొలగించాలి

పాకిస్తాన్‌ కోడలైన సానియా మీర్జా అంబాసిడర్‌గా అవసరమా
 బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ డిమాండ్‌
హైదరాబాద్‌ ఫిబ్రవరి 18 (way2newstv.com)
 తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాను తొలగించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధాలను భారత ప్రజలు కోరుకోవడం లేదని, ఈ తరుణంలో పాకిస్తాన్‌ కోడలైన సానియా మీర్జాను తెలంగాణ ప్రచారకర్తగా తీసేయాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.  ఆయన ఏమన్నారంటే.. 


తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సానియా మీర్జాను తొలగించాలి

‘నమస్కారం.. నా తెలంగాణ ప్రజల్లారా.. తెలంగాణకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మన ముఖ్యమంత్రి.. సానియా మీర్జాను నియమించారు. ఆమె ఎవరు?.. పాకిస్తాన్‌ కోడలు. పెళ్లి అయిపోయిన తర్వాత ఆమె ఆ దేశం కోడలు అవుతుంది. అలాంటి పాకిస్తాన్‌ కోడలిని సీఎం తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేశారు. ముఖ్యమంత్రిగారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవ్వాళ మన సైన్యంపై పాక్‌ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఎంతో మంది జవాన్లు అమరులయ్యారు. ప్రతీ దేశం పాక్‌ను వ్యతిరేకిస్తుంది. భారత్‌ కూడా అన్నిరకాల మద్దతును ఉపసంహరించుకుంది. మీరూ కూడా పుట్టిన రోజు జరుపుకోలేదు. ఈ విషయం తెలిసి చాలా సంతోష పడ్డాను. సానియామీర్జాను ప్రచారకర్తగా తొలగించి పీవీ సింధూ, సైనా నెహ్వాల్‌లో ఒకరిని నియమించండి. ఈ విషయంపై ఒక సారి ఆలోచించండి’ అని రాజాసింగ్‌ విజ్ఞప్తి చేశారు.భారత్‌-పాక్‌ మధ్య ఏ వివాదం చెలరేగిన సానియా మీర్జాకు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రతిఒక్కరు ఆమె దేశభక్తిని ప్రశ్నిస్తూ.. ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. తాజాగా జరిగిన పుల్వామా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కూడా సానియా తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యారు. ఈ విషయంపై ఆమె ఒకింత అసహనాన్ని వ్యక్తం చేస్తూ తన దేశభక్తిపై వివరణ కూడా ఇచ్చుకున్నారు. గొంతు చించుకుంటేనే దేశభక్తా? అంటూ ట్రోలింగ్‌ చేసే వారిపై తీవ్రంగా మండిపడ్డారు.