హరిష్ రావుకు మంత్రి పదవి రాదు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

హరిష్ రావుకు మంత్రి పదవి రాదు

హైదరాబాద్, ఫిబ్రవరి 18 (way2newstv.com)
ఎమ్మెల్యే హరీష్ రావు కు మంత్రి పదవిరాదు. మిడ్ మానేరు, గౌరెల్లి, తోటపల్లి పనుల్లో సుమారు వెయ్యి కోట్లు తీసుకున్నారు. తన బినామీ లకే  అయన కాంట్రాక్ట్ లు ఇప్పించారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. ఆ డబ్బులనే కేసీఆర్ తెలియకుండా హరీష్ ఎన్నికల్లో డబ్బులు పంచారు. హరీష్ అసెంబ్లీ ఎన్నికల్లో 30మంది కి డబ్బులిచ్చారు. హరిష్ రావుకు మంత్రి పదవి రాదు

టీఆరెస్ లో 26 మందికి హరీష్ డబ్బులిచ్చారు. కొందరి కాంగ్రెస్ వాళ్లకు ఇస్తానంటే తీసుకోలేదని అయన అన్నారు. హరీష్, అమిత్ షాతో పోన్ లో మాట్లాడారు. ఇది కేసీఆర్ కు తెలిసింది. హరీష్ తోపాటు మరో నలుగురు సీనియర్లకు మంత్రి పదవి లేదని అన్నారు. తుమ్మల  నాగేశ్వరరావు కేటీఆర్ ను రాము అని పిలిచినందుకే అవుట్ అయ్యారని రేవంత్ అన్నారు. హరీష్ ఎదురు తిరిగితే, పాస్ పోర్ట్ కేసు లో పెట్టేందుకు కేసీఆర్ రెడీ గా ఉన్నారు. కడియం హానెస్ట్. ఒక్క అవినీతి ఆరోపణ లేదు. ఎందుకు కడియం కు మంత్రి ఇవ్వడంలేదని రేవంత్ ప్రశ్నించారు. మాదిగకు కేబినెట్ లో చోటు కనిపిస్తలేదు. నాయినినీ పక్కనబెట్టిండు. రాష్ట్రంలో అవినీతిలో కేసీఆర్ ,కేటీఆర్ లకు ఉన్నారు. లోక్ సభకు ఎన్నికలు వాయిదాకూడా పడొచ్చు. యాభై మంది జవాన్ లకు కేసీఆర్ నివాళులు అర్పించకపోవడం దారుణమని అన్నారు. కేసీఆర్ దృష్టిలో జవాన్, కిసాన్ లకు విలువ లేదు. పోచారం తల్లి చనిపోతే పలకరించిన కేసీఆర్ కు జవాన్ కుటుంబాలను పలకరించలేదు. అదే నిజామాబాద్ లో ఆందోళన చేస్తున్న రైతులను కేసీఆర్ పట్టించుకోదేని రేవంత్ విమర్శించారు.