ఓట్ల తొలగింపు పుకార్లే

అమరావతి, ఫిబ్రవరి 21, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్లో ఓట్ల తొలగింపు అనేది పుకారు మాత్రమే అని ఎవరూ నమ్మవద్దని ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది స్పష్టం చేశారు.  గురువారం మీడియాతో మాట్లాడుతూ 23, 24 తేదీల్లో బూత్ లెవెల్లో ఓటర్ల జాబితా క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  జనవరి 11 వరకు నమోదైన ఓటర్ల జాబితా చెక్ చేసుకోవచ్చని ఆయన చెప్పారు.  నామినేషన్ చివరిరోజు వరకు జాబితాలో మార్పులు, చేర్పులకు అవకాశం ఉందన్నారు. 


 ఓట్ల తొలగింపు పుకార్లే
విశాఖ, తిరుపతి, విజయవాడలో కేంద్ర ఎన్నికల బృందాలు తనిఖీలు చేయనున్నట్లు చెప్పారు.  ఎమ్యెల్యే కోటా ఎన్నికలకు కోడ్ వర్తించదని ద్వివేది వెల్లడించారు.
Previous Post Next Post