చింతమనేని వీడియోలు…వైకాపా నేత ఆరెస్టు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చింతమనేని వీడియోలు…వైకాపా నేత ఆరెస్టు

ఏలూరు, ఫిబ్రవరి 21, (way2newstv.com)
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీడియా వ్యవహారం మరో మలుపు తిరిగింది. దళితులపై అయన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా అయన తన వీడియోను ఎడిట్ చేసి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని చింతమనేని పెదపాడు పోలీసులను ఆశ్రయించారు. 


 చింతమనేని వీడియోలు…వైకాపా నేత ఆరెస్టు

దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. వైసీపీ పశ్చిమగోదావరి ప్రధాన కార్యదర్శి, దళిత నేత నేత కత్తుల రవి జైన్ను అరెస్ట్ చేశారు. కత్తుల రవి జైన్ చింతమనేనికి సంబంధించిన వీడియోను షేర్ చేసినందుకు గానూ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.  తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేనిని అరెస్ట్ చేయకుండా తమ నేతను అదుపులోకి తీసుకోవడం ఏంటని వైసీపీ శ్రేణులు, ఆయన మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, రవిని వెంటనే విడుదల చేయకపోవతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.