చంద్రబాబుతో మర్రిశశిధరరెడ్డి భేటీ

హైద్రాబాద్, ఫిబ్రవరి 19 (way2newstv.com
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి భేటీ అయ్యారు. ఏపీ రాజధాని  అమరావతిలో వీరిద్దరూ భేటీ అయ్యారు. రానున్న ఎన్నికలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం.భేటీ అనంతరం మర్రి శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 


చంద్రబాబుతో మర్రిశశిధరరెడ్డి భేటీ

చంద్రబాబుతో తాను జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పొత్తును.. ప్రజలకు వివరించడంలో విఫలమయ్యామన్నారు. ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పార్టీలన్నీ ఏకమౌతున్నాయమని చెప్పారు.  వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
Previous Post Next Post