అవినీతికి అడ్డగా మారిన చంద్రబాబు ప్రభుత్వం

ప్రకాశం ఫిబ్రవరి 19 (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవినీతికి అడ్డగా మారిందని, డ్రామా రాజకీయాలే తప్ప అభివృద్ధి లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. 


అవినీతికి అడ్డగా మారిన చంద్రబాబు ప్రభుత్వం 

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో 2500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఆ డబ్బును ప్రజలకు ఎప్పుడు చెల్లిస్తారో సమాధానం చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తప్పదని హెచ్చరించారు. టీడీపీ నుంచి  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి వస్తున్న వలసలే ఇందుకు నిదర్శనమన్నారు. 
Previous Post Next Post