మంచి నీటి ఎద్దడి నివారణకు యాక్షన్‌ప్లాన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మంచి నీటి ఎద్దడి నివారణకు యాక్షన్‌ప్లాన్

కడప, పిబ్రవరి 12, (way2newstv.com)
తాగునీటి ఎద్దడి నివారణకు యాక్షన్‌ప్లాన్‌ సిద్ధమైంది. గ్రామీణ నీటి పారుదల శాఖ రూ.9.71 కోట్ల వ్యయంతో నీటిఎద్దడి నివారణకు కసరత్తు చేసింది. నీటిఎద్దడి ఎదుర్కొనే గ్రామాలను గుర్తించింది. 32 మండలాల్లోని 1286 గ్రామాల్లో నీటిఎద్దడి ఎదురయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. 22,765 ట్రిప్పులతో నీటిని తరలించాలని భావించింది. ఫిబ్రవరి ఒకటి నుంచి తాగునీటి మోటార్లు, సిపిడబ్య్లు స్కీమ్‌బోర్లు, చేతిపంపుల మరమ్మతుల నిమిత్తం క్రాష్‌ ప్రోగ్రామ్‌ను చేపట్టింది. 



మంచి నీటి ఎద్దడి నివారణకు యాక్షన్‌ప్లాన్

దీనికి అదనంగా అద్దెబోర్లు, బోర్ల లోతు పెంపు, పూడిక తొలగింపు పనులపై దృష్టి సారించింది. కడపజిల్లాలోని 51 మండలాల్లో 690 పంచాయతీల్లో 4446 గ్రామాలు ఉన్నాయి. ఇందులోని 11,684 చేతిపంపులు, 4,459 పంపింగ్‌, 24 సిపిడబ్య్లు స్కీముల ద్వారా ఆర్‌డబ్య్లుఎస్‌ తాగునీటిని అందిస్తోంది. వీటికి మినహాయింపుగా 1286 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొనే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రధానంగా పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన, గాలివీడు, తొండూరు, టి.సుండుపల్లి, చిన్నమండెం, రామాపురం, లక్కిరెడ్డిపల్లి, రాయచోటి, సంబేపల్లి, మండలాలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే పోరుమామిళ్ల, కాశినాయన, కలసపాడు మండలాల్లో ట్రాక్టర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. గతేడాది సిపిడబ్య్లు స్కీముల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులకు నోచుకోలేదు. గతేడాది ఆర్‌డబ్య్లుఎస్‌కు కాంట్రాక్టర్లు బిల్లుల చెల్లింపులకు నోటీసులు పంపించడం, దీనికి కొనసాగింపుగా తాజాగా ట్రాన్స్‌కో బిల్లుల చెల్లింపుల విషయంలో లక్కిరెడ్డిపల్లిలో సిపి డబ్య్లు స్కీమ్‌లకు కనెక్షన్లు కట్‌ చేయడం తెలిసిందే. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆర్‌డబ్య్లుఎస్‌ జిల్లాలోని 1286 గ్రామాల్లో భాగంగా 466 గ్రామాల్లో 434 వ్యవసాయబోర్లను రూ.75.14 లక్షలతో అద్దెకు తీసుకుంది. లక్కిరెడ్డిపల్లి, రామాపురం, రాయచోటి, సంబేపల్లి, గాలివీడు మండలాల్లో సగటున 25 బోర్లను అద్దెకు తీసుకుంది. ఒక్కో అద్దెబోరుకు నెలకు రూ.3,500 చెల్లించి రూ. 350 చొప్పున ట్యాంకర్‌ నీటిని సర ఫరా చేయాలని ప్రణాళికలు రచించింది. శాశ్వత తాగునీటి ప్రణాళిక అమలుకు పర్యావరణ సమస్య వెక్కిరి స్తోంది. తెలుగుగంగప్రాజెక్టు అంతర్భాగంలోని దిన్నె-బ్రహ్మంసాగర్‌ స్కీమ్‌ ద్వారా పోరుమామిళ్ల, కలసపాడు మండలాలకు, అట్లూరు స్కీమ్‌ ద్వారా బద్వేల్‌, గోపవరం, అట్లూరు మండలాలకు శాశ్వతంగా తాగునీటి సదుపాయాన్ని అందించడానికి ఆర్‌డబ్య్లుఎస్‌ ప్రణాళిక రూపొందించింది. ఒక్కో స్కీమ్‌ నిర్మాణానికి రూ.15 కోట్ల చొప్పున రెండింటికీ రూ.30 కోట్ల వ్యయంతో గతేడాది ప్రతిపాదనలు పంపించింది. స్కీమ్‌ల నిర్మాణ పనులు ఆయా మండల ప్రాంతాల్లో ఫారెస్టు క్లియరెన్స్‌, వైల్డ్‌లైఫ్‌ సమస్య అడ్డంకులు సృష్టిస్తోంది. ఇప్పటికే రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల పరిధిలోని అన్నమయ్య, వెలిగల్లు, ఝురికోన డ్యామ్‌ల ద్వారా రాజంపేట, రాయచోటి, పులివెందుల నియోజకవర్గాల పరిధిలోని రాయచోటి, సంబే పల్లి, సుండుపల్లి, గాలివీడు మండల పరిధిలోని గ్రామాలకు తాగునీరు అందుతోంది. లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల దాహార్తిని అధిగ మించడానికి సిపిడబ్య్లుస్కీమ్‌ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో బ్రహ్మంసాగర్‌, అట్లూరు తాగునీటి స్కీమ్‌ పనులు చేపడితే తాగునీటి ఎద్దడికి చెక్‌ పడే అవకాశం ఉంది.