నేరాలు ఘోరాలు చేసిన అమిత్ షా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నేరాలు ఘోరాలు చేసిన అమిత్ షా

అమరావతి, ఫిబ్రవరి 21,  (way2newstv.in)
ఏపీలో అడ్రస్ లేని పార్టీలకు ప్రచార సభలు పెట్టి అమిత్ షా ఆపసోపాలు పడ్డారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తి అధికార పార్టీకి అధ్యక్షుడిగా ఉండటం దురదృష్టకరమని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. గుజరాత్ లో అమిత్ షా ఎన్ని నేరాలు,ఘోరాలు చేసాడు. ఎందుకు నిన్ను గుజరాత్ నుంచి వెలి వేసారో చెప్పాలి. అమిత్ షా గల్లీలో చిల్లర రాజకీయాలు చేస్తున్నప్పుడు చంద్రబాబు జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారని అన్నారు. గుజరాత్ అల్లర్లు జరిగితే మోడీని తోలగించాలని డిమాండ్ చేసింది చంద్రబాబు. నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రయోజిత అల్లర్లు సృష్టించారు. 


నేరాలు ఘోరాలు చేసిన అమిత్ షా

మోడీని తొలగించాలని వాజపేయి నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు అంటే వాజపేయి కి ఉన్న అభిమానం వల్ల ఎన్డీయే నుంచి బయటికి రాలేదు. 
చంద్రబాబుకు కి విశ్వసనీయత లేకపోతే అప్పట్లో ఆయనకు జాతీయ రాజకీయాల్లో అంత ప్రాధాన్యం ఎలా వచ్చిందని అన్నారు. బీజేపీ తో కలవడం వల్ల 14 సీట్లు కోల్పోయాం. అమిత్ షా అవాకులు,చవాకులు పేలుతున్నాడు. తెలుగు నేల మీదకు ఏ మొహం పెట్టుకొని రేండోసారి వచ్చావని అన్నారు. జగన్, కేసీఆర్ సహకారంతో ఇక్కడికి వస్తున్నాడు. ఒక్క స్థానంలో అయినా బీజేపీ కి కనీసం డిపాజిట్ లు వస్తాయా అన్నారు. 
జగన్ కు రాజకీయ లబ్ది కోసం అమిత్ షా ఇక్కడికి వస్తున్నాడు. వైసీపీకి అద్దె మైకుగా అమిత్ షా ఇక్కడికి వస్తున్నాడు. చంద్రబాబు ను విమర్శిస్తే తెలుగువారి గుండె రగులుతోంది. దేశ భద్రత మీద అమిత్ షా అనవసరమైన ఆరోపణలు చేసాడని అన్నారు. ఎవరు రాజకీయ కోణంలో చూస్తున్నారో దేశ ప్రజలకు తెలుసు. జవాన్లపై దాడి జరిగిన నాలుగున్నర గంటలు మోడీ ఎక్కడికి వెళ్ళిపోయాడు. దేశ భద్రతను రాజకీయం చేసి ఓట్లు దండుకునే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.