స్టార్ డైర‌క్ట‌ర్ వినాయ‌క్ చేతుల మీదుగా `డిసెంబర్ 31` మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్‌ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

స్టార్ డైర‌క్ట‌ర్ వినాయ‌క్ చేతుల మీదుగా `డిసెంబర్ 31` మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్‌

శ్రీ గౌతం క్రియేష‌న్స్ ప‌తాకంపై గ‌ణ‌గ‌ళ్ల మాన‌స స‌మర్ప‌ణ‌లో జి.ల‌క్ష్మ‌ణరావు నిర్మిస్తోన్న చిత్రం `డిసెంబ‌ర్  31` `వ‌ర్మ‌గారి బంగ్లా` ట్యాగ్ లైన్.  జి. కొండ‌ల‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నారు. ఇటీవ‌ల ఈ చిత్రానికి సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ చేతుల మీదుగా హైదారాబాద్ లో  లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా వి.వి.వినాయ‌క్ మాట్లాడుతూ...``మోష‌న్ పోస్ట‌ర్  చాలా  క్రియేటివ్ గా ఉంది.  స్టోరి లైన్ విన్నాను. స‌స్పెన్స్ తో కూడిన కామెడీ థ్రిల్ల‌ర్ .  ముఖ్యంగా సినిమాకు  ఏసిపి ర‌వీంద్ర పాత్ర ప‌వ‌ర్ ఫుల్ గానే కాకుండా  సినిమాకే   హైలెట్ గా నిల‌వ‌నుంది . సినిమా స‌క్స్ స్ సాధించాల‌ని కోరుకుంటూ యూనిట్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు`` అన్నారు.
 ద‌ర్శ‌కుడు జి.కొండ‌ల‌రావు మాట్లాడుతూ...


 స్టార్ డైర‌క్ట‌ర్ వినాయ‌క్ చేతుల మీదుగా `డిసెంబర్ 31` మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్‌

``ఈ సినిమా అర‌కు, వైజాగ్, హైద‌రాబాద్ ప‌రిస‌ర  ప్రాంతాల్లో షూటింగ్ చేశాము. క‌థ విష‌యానికొస్తే...ప్ర‌తి డిసెంబ‌ర్ 31 కు ఎంతో మంది అమ్మాయిలు పార్టీ పేరుతో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. హ‌త్య‌లు చేయ‌బ‌డుతున్నారు. అస‌లు ఇది ఎలా జ‌రుగుతుంది?  దీన్ని ఏ విధంగా ఆవ‌ప‌వ‌చ్చు. అస‌లు చేస్తుంది ఎవ‌రు?  దానిని గుర్తించ‌డం కోసం స్పెష‌ల్ ఆఫీస‌ర్ , ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిష్ట్ ఏసిపి ర‌వీంద్ర రంగంలోకి దిగి అస‌లు హంత‌కుల‌ను ఎలా ప‌ట్టుకున్నారు అన్న‌ది చిత్ర క‌థాంశం. మా సినిమా మోష‌న్ పోస్ట‌ర్ ను ఆవిష్క‌రించిన వినాయక్ గారికి నా ధ‌న్య‌వాదాలు`` అన్నారు.
 ఈ చిత్రంలో జి.కొండ‌ల‌రావు, న‌వ‌కాంత్, ష‌క‌ల‌క శంక‌ర్‌, పోసాని, గౌతం రాజ్‌, న‌రేష్ , గిరీష్‌, హ‌ర్ష‌, శ్రావణి, మ‌ధురెడ్డి, అమీషా త‌దిత‌రులు న‌టించారు.
స‌హ‌నిర్మాతః అంబ‌టి రాఘ‌వేంద్ర‌రెడ్డి;  రాయితి రమ‌ణ‌మూర్తి;  జి.అప్పారావు; స‌ంగీతంః బోలె;  పాట‌లుః కందికొండ‌;  కెమెరాః వెంక‌ట్;  ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ః పాట శ్రీను;  పీఆర్వోః వంగాల కుమార‌స్వామి; క‌థ‌-స్క్రీన్ ప్లే -ద‌ర్శ‌క‌త్వంః జి.కొండ‌ల‌రావు; నిర్మాతః జి.ల‌క్ష్మ‌ణ‌రావు,