డెబ్రిస్ జీరో ప్రాజెక్ట్ తో పర్యావరణ పరిరక్షణ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

డెబ్రిస్ జీరో ప్రాజెక్ట్ తో పర్యావరణ పరిరక్షణ

ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఇఓ విన్నీపాత్రో
- చెత్త నుంచి ఎరువుల తయారీ కేంద్రం
- మచిలీపట్నం మున్సిపల్ డంపింగ్ యార్డులో శంకుస్థాపన
మచిలీపట్నం, ఫిబ్రవరి 22 (way2newstv.com)
కొండలా పేరుకుపోతున్న చెత్త, ప్రపంచంలో నేటి అతి పెద్ద సమస్య అని  ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఇఓ విన్నీపాత్రో అన్నారు. దేశ రాజధాని ఢిల్లీ మొదలుకొని... నగరాలు, పట్టణాల వరకు పేరుకుపోతున్న చెత్త వల్ల పర్యావరణ కాలుష్యం పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారంగా చెత్త నుంచి సంపద సృష్టిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ స్వచ్ఛ ఆంధ్రకు శ్రీకారం చుట్టారని వివరించారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో చెత్త నుంచి ఎరువులు, ఉప ఉత్పత్తులను తయారుచేసే డెబ్రీస్ జీరో ప్రాజెక్టుకు సీఇఓ విన్నీపాత్రో శుక్రవారం శంకుస్థాపన చేశారు. 


 డెబ్రిస్ జీరో ప్రాజెక్ట్ తో పర్యావరణ పరిరక్షణ

ఈ కార్యక్రమంలో మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, డెబ్రిస్ మైనింగ్ ట్రెజర్స్ లిమిటెడ్ సి.ఇ.ఓ. చలువాది విజయ భాను , చలువాది  శ్రీనివాసరావు పాల్గొన్నారు. మున్సిపాలిటీలలో ఏళ్ళ తరబడి పేరుకుపోయిన చెత్త నుంచి డంపింగ్ యార్డులకు విముక్తి కలిగించడమే డెబ్రిస్ జీరో ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఇఓ విన్నీపాత్రో వివరించారు. ఇళ్ళ నుంచి వస్తున్న తడి, పొడి చెత్తను సేకరించి ఇప్పటికే వర్మి కంపోస్ట్ చేస్తున్నారని, కానీ ఏళ్ళ తరబడి డంపింగ్ యార్డుల్లో చెత్త పేరుకుపోయిన చెత్త పర్యావరణానికి సవాలుగా మారుతోందన్నారు. డంపింగ్ యార్డులో చెత్త నుంచి సేంద్రీయ ఎరువు సిటీ కంపోస్ట్ తయారు చేసి, డంపింగ్ యార్డును బై ప్రోడక్ట్ ద్వారా జీరో చేస్తామని డెబ్రీస్ జీరో లీడ్ ఫోర్మెన్ సి.హెచ్ శ్రీనివాసరావు వివరించారు. సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, కొల్లు రవీంద్ర, నారాయణ, మున్సిపల్ ఛైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, తదితరుల సహకారంతో కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంను కాలుష్య రహితంగా తీర్చిదిద్దుతామన్నారు. సైంటిస్ట్ మైనంపాటి మణికుమార్, కౌన్సిలర్ రాయపూడి ప్రమీల తదితరులు పాల్గొన్నారు.