క్రాఫ్ట్ విలేజ్ అకాడమీ ఏర్పాటు పై చర్చ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

క్రాఫ్ట్ విలేజ్ అకాడమీ ఏర్పాటు పై చర్చ

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (way2newstv.com):  
చివాలయంలో సీఐఐ మాజీ ఛైర్మన్ వనిత దాట్ల తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ పర్యాటక శాఖ  సహకారం తో సీఐఐ  ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ విలేజ్ అకాడమీ ఏర్పాటు పై చర్చించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు  ప్రతిబింబించేలా కళలు, హ్యాండిక్రాఫ్ట్స్ లు ఈ క్రాఫ్ట్ విలేజ్ అకాడమీ లో ఉండే విదంగా చర్యలు తీసుకోవాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం సీఐఐ  ప్రతినిధులకు సూచించారు.హైదరాబాద్ గ్లోబల్ సిటీ పై సీఐఐ  ఆధ్వర్యంలో జియోగ్రాఫికల్ ఇంటలెచ్కువల్ ట్యాగ్ ను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. 


 క్రాఫ్ట్ విలేజ్ అకాడమీ ఏర్పాటు పై చర్చ

సీఐఐ  మాజీ ఛైర్మన్ వనిత దాట్ల అందుకు అవసరమైన సహకారాన్ని తెలంగాణ పర్యాటక శాఖ అందించాలని  సీఐఐ చేసిన విజ్ఞప్తి పై సానుకూలంగా స్పందించారు శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం. సీఐఐ  ఆధ్వర్యంలో టూరిజం ఈవెంట్ లను నిర్వహించేందుకు అవసరమైన అనుమతులు, సహకారం అందించాలని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ను కోరారు. తెలంగాణ పర్యాటక శాఖ , సీఐఐ  భాగస్వామ్యం లో హైదరాబాద్ ఫెస్టివల్ తో పాటు మేజర్ ఫెస్టివల్స్ ను  నిర్వహించాలని ఈ సమావేశంలో చర్చించారు.ఈ సమావేశంలో సీఐఐ  ప్రతినిధులు అనురాగ్ శర్మ, శుభోదిత్ సహా లు పాల్గొన్నారు