అమలాపురం నుంచి బరిలోకి హరీశ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అమలాపురం నుంచి బరిలోకి హరీశ్

కాకినాడ, ఫిబ్రవరి 20, (way2newstv.com)
అమలాపురం లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్ధిగా దివంగత లోక్‌సభ స్పీకర్‌ జి.ఎం.సి. బాలయోగి కుమారుడు హరీశ్‌ పేరును అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. సెంటిమెంటు పరంగానూ ఇది అనుకూలిస్తుందనే అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతోంది. పోటీ విషయమై తల్లి అంగీకారం కోసం హరీశ్‌ ఎదురు చూస్తున్నారు. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు నాకు టికెట్ ఇవ్వనని చెప్పారు, అందుకే వైసీపీలో చేరుతున్నా అని చెప్పిన సంగతి తెలిసిందే. అమలాపురం లోక్‌సభ టీడీపీ టిక్కెట్టు లోక్‌సభ దివంగత స్పీకర్‌ బాలయోగి కుమారుడు హరీష్‌కి ఖరారు చేయడంతో పండుల టీడీపీకి గుడ్‌బై చెప్పారు. పండుల రవీంద్రకి వైసీపీలో గన్నవరం అసెంబ్లీ సీటు హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

 
అమలాపురం నుంచి బరిలోకి హరీశ్

టీడీపీ నుంచి మంత్రి హామీ కావాలని పట్టుబడుతున్న మరో ఎమ్మెల్యే కూడా వైసీపీతో టచ్‌లో ఉన్నట్టు విస్తృత ప్రచారం జరుగుతోంది. సదరు ఎమ్మెల్యే వైసీపీలో చేరితే అక్కడ ప్రత్యర్థి పార్టీ నేత వెంటనే టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో టీడీపీలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిలు, వైసీపీ కోఆర్డినేటర్లలో టెన్షన్‌ పెరుగుతోంది. ఎవరు వచ్చి పార్టీలో చేరతారు, ఎవరిని తప్పిస్తారన్న ఆందోళన ఇరుపార్టీల నేతల్లోనూ కనిపిస్తోంది. టీడీపీ జిల్లాలో ఇప్పటికే ఎనిమిది నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. వైసీపీ 12 చోట్ల స్పష్టత ఇచ్చింది.మరో పక్క కాకినాడ ఎంపీ సీటు కూడా ఫైనల్ అయినట్టు సమాచారం. దీని కోసం చలమలశెట్టి సునీల్‌ ని తెలుగుదేశం రంగంలోకి దించుతుంది. టీడీపీలో ఈనెల 28న చేరడానికి చలమలశెట్టి సునీల్‌ సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ మేరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో అమరావతిలో చేరాలని సునీల్‌ నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. మూడు నెలలుగా సునీల్‌ చేరిక ముహూర్తాలు వాయిదాపడుతూ వస్తున్నాయి. చివరకు ఈనెల 28వ తేదీ చేరడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కాకినాడ లోక్‌సభ టీడీపీ టిక్కెట్టు సునీల్‌కి ఇవ్వనున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం తెదేపా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సోమవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చారు. తాను పార్టీ మారుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు