విషాదం నింపిన బెంగళూరు ఎయిర్ షో - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విషాదం నింపిన బెంగళూరు ఎయిర్ షో

గాల్లో రెండు యుద్ధ విమానాలు ఢీ 
ఒక పైలెట్ దుర్మరణం.,.ప్రాణాపాయం నుంచి బయటపడ్డ మరో ఇద్దరు 
బెంగళూరు ఫిబ్రవరి 19 (way2newstv.com)
బెంగళూరు ఎయిర్ షోలో విషాదం నిండింది. ఏరో ఇండియా-2019 పేరిట బెంగుళూరులో ఎయిర్ షో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రిహార్సల్ నిర్వహిస్తుండగా రెండు యుద్ధ విమానాలు పరస్పరం గాల్లోనే ఢీకొట్టుకున్నాయి.  మంటల్లో చిక్కుకున్నాయి. నిప్పులు చిమ్ముతూ నేలరాలిపోయాయి. చూస్తుండగానే కుప్పకూలిపోయాయి.  అగ్ని గోళాల్లో మారిపోయాయి. పారచూట్ సాయంతో దూమికిన ఒక పైలెట్ దుర్మరణం పాలయ్యారు. 

 
విషాదం నింపిన బెంగళూరు ఎయిర్ షో

మరో ఇద్దరు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.. మంగళవారం మధ్యాహ్నం బెంగళూరు నగర శివార్లలోని యలహంక ఎయిర్ బేస్ టెర్నినల్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఈ ఎయిర్ బేస్ టెర్మినల్ లో ఏరో ఇండియా 2019 ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. దీనికోసం వైమానిక దళ అధికారులు యుద్ధవిమానాలతో రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు.రిహార్సల్స్ లో భాగంగా వాయుసేనకు చెందిన యుద్ధవిమానాలు హెలీక్యాప్టర్లతో విన్యాసాలు నిర్వహిస్తుండగా.. సూర్యకిరణ్ ఏరోబాటిక్స్ బృందానికి చెందిన రెండు తేలికపాటి విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. 200 కి.మీల వేగంతో ప్రయాణిస్తూ ఢీకొట్టుకోవడంతో ఓ విమానంలో ఉన్న పైలెట్ కో పైలెట్ ప్రమాదాన్ని ముందే పసిగట్టి కిందకు దూకేశారు.  మరో విమానంలోని కోపైలెట్ మృత్యువాత పడ్డారు.ఢీకొట్టిన వెంటనే విమానాలు ముక్కులుముక్కలయ్యాయి. మంటలు చెలరేగి కాలిపోయాయి. కొన్ని శకలాలు బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారి సమీపంలో పడ్డాయి. సమాచారం అందుకున్న యలహంక శివారు అగ్నిమాపక దళాలు వెంటనే వచ్చి మంటలు అదుపు చేసి గాయపడ్డ పైలట్లను ఆస్పత్రిక తరలించారు.