సంక్షేమ పధకాలపై ధర్డ్ పార్టీ తనిఖీలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సంక్షేమ పధకాలపై ధర్డ్ పార్టీ తనిఖీలు

కాకినాడ, ఫిబ్రవరి 20, (way2newstv.com
వివిధ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాల తీరుతెన్నులను పరిశీలించేందుకు ధర్డ్ పార్టీతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించనున్నారు.జిల్లాలో సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు సర్కార్... దీని ద్వారా పారదర్శకత, పథకాల నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు సాధ్యమవుతాయన్నారు. జిల్లాలో వచ్చే వేసవిలో నీరు-చెట్టు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలుచేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రూ.70 నుండి రూ. 80 కోట్ల మేర పనులు చేపట్టేందుకు కృషిచేస్తున్నట్టు తెలిపారు. 


సంక్షేమ పధకాలపై ధర్డ్ పార్టీ తనిఖీలు

జిల్లాలోని ఏజన్సీ, మెట్ట, డెల్టా ప్రాంతాల్లో కాలువలు, డ్రెయిన్లు, చెరువుల్లో పూడిక తీత పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవల్సి ఉందని, ఈ పనులన్నీ సమర్ధవంతంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో రబీ పంటకు సాగునీటి కొరత లేదని, ప్రతిరోజు సీలేరు నుండి 4 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. మత్స్యశాఖ పనులపై సమీక్షిస్తూ అంతర్వేది పల్లెపాలెం వద్ద నిర్మిస్తున్న ఫిష్ ప్లాట్‌ఫారం కోసం అదనంగా రూ. 9.14 కోట్లు విడుదలయ్యాయన్నారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కొబ్బరి నిల్వ కేంద్రాలను ఉపాధి హామీ పథకం కింద నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లాలో డిజిటల్ క్లాసు రూంలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కస్తూరిబా పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూంల ఏర్పాటుకు వివిధ స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు