పరుగులు పడుతున్న ప్రాజెక్టులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పరుగులు పడుతున్న ప్రాజెక్టులు

అదిలాబాద్, ఫిబ్రవరి 13, (way2newstv.com)
వర్షకాలం వచ్చే లోపు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లన్నీ పూర్తి కావాలి. చుక్కనీరు కూడా వృథాగా పోవద్దు. ప్రాజెక్ట్‌లకు దిగువ నున్న ఆయట్టు పరిధికి నీళ్లు పారాలే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గోదావరి నది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను మి తిగా జిల్లాతో విడదీస్తూ సరిహద్దుగా సాగుతోంది. ప్రస్తుతం నిర్మిస్తున్న భ్యారేజి నిర్మల్, జగిత్యాల జి ల్లాల మధ్య ఉంది. నిర్మల్ జిల్లా మామడ మండలం పొ న్కల్, జగిత్యాల జిల్లా ఇబ్రహీం పట్నం మండలం ములారాంపూర్ గ్రామాల మధ్య గోదావరికి అడ్డంగా నది పై రాష్ట్రంలోనే ప్రధమే ప్రధాన ప్రాజెక్టుగా ఉన్న శ్రీరాంసాగర్‌కు కేవలం 42 కిలో మీటర్ల దూరంలోనే ఈ భ్యారేజీ నిర్మాణం సాగుతుంది.


 పరుగులు పడుతున్న ప్రాజెక్టులు

 ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.ప్రస్తుతం జిల్లాకు జీవనదిగా మారిన గోదావరిపై సదర్మాట్ భ్యారేజీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రెండేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా బిల్లుల చె ల్లింపులో జాప్యం, ఇతరత్రా కారణాలతో ఇప్పుడప్పుడే ఓ స్థాయికి చేరుతుంది. ప్రస్తుతం గోదావరి నీ ళ్లు తగ్గడంతో నిర్మాణం జోరందుకుంది. ఇరువైపు లా మట్టికట్ట నిర్మాణ పనులు సాగుతున్నాయి. సదర్మాట్ నిర్మాణం పూర్తయితే నిర్మల్‌లతో పాటు ప క్కనే ఉన్న జగిత్యాల జిల్లాకు సాగు,తాగు నీటికి పె ద్ద దిక్కుగా మారునుంది. భ్యారేజీ నిర్మాణ పనుల ను బుధవారం సీఎం డిఎఫ్‌డి శ్రీధర్ దేశ్‌పాండే ప రిశీలించి వెళ్లారు. పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చే సిన ఆయన మరింత వేగంగా పూర్తి చేయాలని సూ చించారు. భ్యారేజీ స్వర్ణనది, కనకాపూర్ వాగు వంటి పెద్ద వాగులు,వంకలతో పాటు సరస్వతి కెనాల్ ద్వారా నిండిపోయిన చెరవుల నీళ్లు చేరుతాయి. మొత్తం 158 టిఎంసీల నీటి నిల్వ సామర్థం అంచనాలతో పనులు చేపడుతున్నారు. ఈ భ్యారేజీ నిర్మాణం పూర్తయితే నిర్మల్, జగిత్యాల జిల్లాలో దాదాపు 13వేల ఎకరాల వరకు సాగు నీరు అందనుంది. తాగునీటి అవసరాలకు ఉపయోగపడనుంది. అలాగే ఇక్కడ భ్యారేజీ కం బ్రిడ్జిగా పనులు సాగుతుడడంతో రెండు జిల్లాల మధ్య దూరం గణణీయంగా తగ్గనుంది.నిర్మల్ జిల్లాగా ఏర్పడిన తరువాత 2017 జనవరి 11న అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరిష్‌రావు ఈ భ్యారేజీ నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. పనులు సజావుగానే ప్రారంభమైనా మధ్యలో వేగం మందగించాయి. గోదావరి వరద రావడంతో వర్షకాలంలో ప్రాజెక్ట్ నిర్మాణ సామాగ్రి, కవర్ డ్యాం కొట్టుకుపోయాయి. దీంతో సంబంధిత కాంటారక్టరుకు కొంత నష్టం వాటిల్లింది. ఆ తరువాత కూడా గోదావరిలో నీటి నిల్వ ఉండడంతో పనులకు ఆటంకం ఏర్పడింది. ఇటీవల మళ్లీ నిర్మాణ పనులు వేగమందుకున్నాయి. ప్రస్తుతం అన్ని ప్రాజెక్ట్‌లు, నిర్మాణ పనులకు ఉన్న సమస్యే ఇక్కాడా ఉంది. ప్రభుత్వం నుండి సంబంధిత కాంట్రాక్టర్‌కు బిల్లులు అందడం లేదు. రూ. 516.223 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం ప్రారంభించారు. ఆ తరువాత మరో రూ. 4.15 కోట్ల వ్యయం పెరగడంతో మొత్తం రూ.520.388 కోట్లకు చేరింది. ప్రస్తుతం పొన్కల్ మూలరాంపూర్ గ్రామాల వైపు మట్టికట్ట నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. పొన్కల్ వైపు 750 మీటర్లు, మూలరాంపూర్ వైపు 1250 మీటర్ల కట్ట నిర్మాణం చేపడుతున్నారు.సదర్‌మాట్ భ్యారేజీని 13వేల ఎకరాల ఆయకట్టుకు నీరందేలా మొత్తం 54 గేట్లతో నిర్మిస్తున్నారు.ఈ నిర్మాణంతో రెండు జిల్లాలో కలిపి 1200 ఎకరాల భూములు ముంపుకు గురికానున్నాయి. జిల్లాలో పొన్కల్ గ్రామంలో 511 మంది రైతులకు చెందిన 497.12 ఎకరాలు, కమల్‌కోట్‌లో 112 మందికి చెందిన 127.34 ఎకరాలు, ఆదర్శనగర్‌లో 43 మందికి చెందిన 48.08 ఎకరాలు, టెంబరేణికి చెందిన 55 మందికి చెందిన 79.09 ఎకరాల భూమి ముంపునకు గురికానుంది. రెండేళ్లు పూర్తియినా… ఇప్పటికీ సగం మందిరైతులకు పరిహారం అందజేదు, ఇప్పటి వరకు 259 మంది రైతులకు రూ. 34.26 రెట్లు ఇవ్వగా… ఇంకా 489 మంది రైతులకు రూ. 41.50 కోట్ల వరకు పరిహారం చెల్లించాల్సి ఉంది.