మాచర్లలో మంత్రి పుల్లారావు పర్యటన - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మాచర్లలో మంత్రి పుల్లారావు పర్యటన

గుంటూరు, ఫిబ్రవరి 21, (way2newstv.com)
గురువారం నాడు మాచర్ల పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గోన్నారు. బుగ్గవాగు నుంచి మాచర్ల పట్టణం వరకు రూ 83 కోట్లతో నిర్మించనున్న తాగునీటి రక్షిత పథకానికి, రూ 18 కోట్లతో నిర్మించనున్న పలు సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేసారు. తరువాత పట్టణంలో అన్న క్యాంటీన్ను, మాజీ ఎంపీ కోట సైదయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. 


మాచర్లలో మంత్రి పుల్లారావు పర్యటన

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అభివృద్ధి అంటేనే చంద్రబాబు, చంద్రబాబు అంటేనే అభివృద్ది అని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్కు ఓటు అడిగే అర్హత లేదని అన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే జగన్ రాష్ట్రాన్ని పరిపాలించాలనుకోవడం విడ్డూరం. నేరవేర్చలేని హమీలతో జగన్ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని అన్నారు. 
అమరావతి రాజధాని, పొలవరం నిర్మాణాలను అడ్డుకునే జగన్ను ప్రజలు క్షమించరని అన్నారు.  ప్రజలు అవినీతి చేసిన జగన్ను, అభివృద్ధి చేస్తున్న చంద్రబాబును చూస్తున్నారు.  చంద్రబాబు నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరమని అన్నారు.