రైతులకు నేరుగా రుణమాఫీ చెక్కులు: సీఎం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రైతులకు నేరుగా రుణమాఫీ చెక్కులు: సీఎం

హైదరాబాద్‌ ఫిబ్రవరి 23 (way2newstv.com
రైతులకు నేరుగా రుణమాఫీ చెక్కులు అందజేసే ఆలోచన చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రైతులపై వడ్డీ భారం పడకుండా చర్యలు తీసుకుంటామని.. వడ్డీతో కలిపి రుణమాఫీ చెక్కులు చెల్లిస్తామని స్పష్టం చేశారు. రైతులకు నాలుగు దఫాలుగా రుణమాఫీ చేస్తామని రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని సీఎం పేర్కొన్నారు.గతంలో తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేయగా బ్యాంకర్లు రైతులను ఇబ్బందిపెట్టారు. 


 రైతులకు నేరుగా రుణమాఫీ చెక్కులు: సీఎం

రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లో రుణమాఫీ నగదును జమ చేయగానే లబ్ధిదారుల నుంచి బ్యాంకర్లు వడ్డీ కట్‌ చేసుకున్న సంఘటనలు కొన్నిచోట్ల జరిగాయి. మరోసారి రైతులకు అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు నేరుగా వడ్డీతో కలిపి రుణమాఫీ చెక్కులు అందజేయడానికి సీఎం కేసీఆర్‌ సన్నాహాలు చేస్తున్నారు.  తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.50వేల కోట్లకు పైగా నిధులు పోతున్నాయని.. రాష్ర్టానికి రూ.24 వేల కోట్ల దాకా తిరిగి వస్తున్నాయని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివరించారు. ప్రతీనెలా పంచాయతీలకు సకాలంలో నిధులు విడుదల చేస్తామని చెప్పారు. కేంద్రం ఇచ్చే నగదుతో సంబంధం లేకుండానే రైతుబందు కింద రూ.10వేలు ఇస్తామని పేర్కొన్నారు.