నగర పంచాయతీ వద్దు రా గ్రామపంచాయతీ ముద్దు రా

సిద్దిపేట, ఫిబ్రవరి 16 (way2newstv.com
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం  ధర్మాజీ పేట గ్రామంలో  గ్రామస్తులు  భారీ ర్యాలీని నిర్వహించారు . దుబ్బాక నగర పంచాయతీ లో ధర్మాజీ పేటను విలీనం చేసినప్పటి నుండీ గ్రామ సమస్యలపై ఒక్కనాడు కూడా ఈ కమీషనర్ గానీ, మున్సిపల్ సిబ్బంది గానీ పట్టించుకున్న పాపాన పోలేరని వాపోతున్నారు.  గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ గాని,రోడ్లు గాని, వీధి దీపాల నిర్వహణ ,మురుగు కాలువల నిర్వహణ  ఇలా ఏవైనా సమస్యల కొరకు తాము మొర పెట్టుకుందామంటే దుబ్బాక  కమిషనర్ ఆఫీస్ కి వెళ్తే అక్కడ కమిషనర్  దర్శనమే దొరకదు.


నగర పంచాయతీ వద్దు రా గ్రామపంచాయతీ ముద్దు రా 

 ఒకవేళ ఉన్నా  మా సిబ్బందిని పంపిస్తాము. సమస్యను తొందర్లోనే పరిష్కరిస్తామని అంటారు. కానీ మళ్ళీ అటు వంక కూడా చూడరు.  గ్రామంలో సమస్యలు   ఎక్కడ వేసిన గొంగడి అక్కడే   అన్న చందంగా ఉంటున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .ఇలా ఏ చిన్న సమస్య ఉన్న మేము మా పనులన్నీ పక్కన పెట్టి ప్రత్యేకించి అక్కడికి వెళ్లాలి ,అదే మాకు గ్రామపంచాయతీ గనుక ఉంటే మా ఊరి సర్పంచ్  వార్డు మెంబర్లకు మా సమస్యలను విన్నవించుకొని పరిష్కరించుకునే వాళ్ళమని అన్నారు. నగర పంచాయతీలో విలీనమైనప్పటినుండి మా గ్రామంలో ఉపాధి హామీ పనులు అన్నీ ఆగిపోయాయి వాటి పైన ఆధారపడి ఉన్న మాకు పని లేకుండా పోయిందని మా పొట్ట కొడుతున్నారని ఉపాధిహామీ కార్మికులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.గృహ నిర్మాణం  అనుమతి కోసం వెళ్తే భారీగా దోపిడి చేస్తున్నారని వాపోతున్నారు.
Previous Post Next Post