మాజీ మంత్రి హరీష్ రావు
నంగునూరు, ఫిబ్రవరి 16 (way2newstv.com):
సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం మైసంపల్లి గ్రామంలో శనివారం మధ్యాహ్నం 192 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే హరీష్ రావు, సిద్ధిపేట ఆర్డీఓ జయచంద్రా రెడ్డితో కలిసి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ 45 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న భూ రెవెన్యూ సమస్యలకు పరిష్కారం జరిగిందని. ఇందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. నర్మెట నుంచి వేరుపడి గ్రామ పంచాయతీ కావడం, పట్టాదారు పాసు పుస్తకాలు రావడంతో.. మైసం పల్లి గ్రామంలో సమస్త సమస్యలకు కారణం పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీతో గ్రామ రైతుల రంది తీరిందన్నారు.
ఎన్నో యేండ్ల సమస్య పరిష్కారమైంది
గ్రామంలో మొదటి సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నుకుని గ్రామాన్ని అభివృద్ధి చేశారని., మైసంపల్లి పరిశుభ్రమైన గ్రామంగా.. ఇదంతా గ్రామస్తులంతా గొప్పతనమని గ్రామస్తులను అభినందించారు. ఇక ఈ గ్రామానికి కావాల్సింది.. గోదావరి నీళ్లు. ఇప్పటికే కాలువ పనులు పూర్తయ్యాయి. కౌడాయపల్లి ఫీడరు చానల్ పూర్తయ్యాయని.. కాళేశ్వరం నీళ్లు తెస్తే, రెండు పంటలు పండించవచ్చని పేర్కొన్నారు.
నేను మీ దగ్గరికి రాకున్నా మీరు నన్ను ఆశీర్వాదించారని లక్ష మెజారిటీ ఇచ్చి గెలిపించిన మీకు ఎంత చేసిన తక్కువేనని అన్నారు.యేడాది లోపు కాళేశ్వరం ప్రాజెక్టు.. గోదావరి జలాలు తీసుకోస్తా. దేవుడి దయతో వచ్చే వానా కాలం యాసంగికే నీళ్లు అందిస్తానని రైతులకు భరోసా ఇచ్చారు.
రానున్న రోజులలో గోదావరి జలాలు వచ్చి వ్యవసాయం ద్వారా బంగారం పండించవచ్చని, సేంద్రీయ వ్యవసాయం చేస్తే లాభసాటిగా జరుగుతుందని వివరిస్తూ మీ భూములు అమ్ముకోవద్దని రైతుల హితవు చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రైతుబంధు పథకం కింద రానున్న రోజుల్లో రూ.10వేలు ఇవ్వనున్నట్లు.. మీరు పండించే పంటలకు సరైన గిట్టుబాటు ధర వచ్చేలా సిద్ధిపేట కూరగాయల మార్కెట్లో మీకు అవకాశం ఉంటుందని చెప్పారు. గ్రామ యువతలో మార్పు రావాలని, రైతాంగం పై దృష్టి సారించాలని, ఇంజనీరింగ్, డాక్టర్ చదువులు చదివిన తర్వాత కూడా వ్యవసాయం మీద దృష్టి సారించి ఎంతో మంది లాభసాటిగా వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. సేంద్రీయ వ్యవసాయంతో ఖర్చులు తక్కువగా దిగుబడి ఎక్కువగా ఉంటుందని, సేంద్రీయ వ్యవసాయం చేస్తానంటే మైసంపల్లి గ్రామస్తులకు సహకరిస్తూ రైతులకు ఆవులను ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.మైసంపల్లి గ్రామ యువత కలిసి మెలిసి ఉండాలని కోరుతూ.. మీరు కలిసి కదలండి.. మీ సేవకుడిలా.. మీ గ్రామనికి అడిగిన ప్రతి పనిని చేస్తానని యువతలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ ప్రతి ఆదివారం గ్రామ యువత శ్రమదానం చేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉండేలా చూడాలని.. గ్రామాన్ని స్వచ్ఛతగా ఉండేలా శుభ్రత పాటిద్దామని కోరుతూ.. మీకు కావాల్సిన జిమ్, లైబ్రరీ ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు. ఈ . కార్యక్రమంలో ఎంపిపి శ్రీకాంత్ రెడ్డి, ఎంపిడిఓ నాగేందర్, మండల రైతుసమన్వయ సమితి నాయకులు బి.కిష్టారెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ కోల రమేశ్ గౌడ్,డి.మల్లయ్య,సర్పంచ్ రాజెల్లయ్య, టిఆర్ ఎస్ మండల అద్యక్షులు అనగోని లింగంగౌడ్, నాయకులు కూతురు రాజిరెడ్డి, సంగుపురేందర్, పుప్పాల నారాయణ,సర్పంచ్ లు కొండల్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అజీజ్,చక్రపాణి తదితరులుపాల్గొన్నారు.
Tags:
telangananews