డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ తో నిర్మాణాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ తో నిర్మాణాలు

విజయవాడ, ఫిబ్రవరి 19, (way2newstv.com)
రాజధాని అమరావతి నిర్మాణంలో అత్యాధునిక సాంకేతిక పరి జ్ఞానం వినియోగిస్తున్న ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. సాంకేతికతకు పెద్ద పీట వేస్తూ రహదార్లు, భవన నిర్మాణ, ఇతర అభివృద్ధి పనులను చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రాజధానిలో అతి పెద్ద కేంద్రీకృత కూలింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సమాయత్తమైంది. రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాలకు, వ్యాపార సముదాయాలకు, నివాస గృహాలకు, సెంట్రలైజ్డ్‌ విధానంలో ఏసీ సదుపాయం కల్పించేందుకు సీఆర్డీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సీడ్‌ క్యాపిటల్‌ లో డీసీఎస్‌  ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దేశంలోనే అతి పెద్ద వ్యవస్థగా దీన్ని రూపొందించనున్నారు. ఈ వ్యవస్థ ద్వారా మొదటగా పరిపాలన నగరంలోని సచివాలయం, శాసనసభ, హైకోర్టు, భవనాలకే ఈ సదు పాయం కల్పించాలని భావించారు.


 డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ తో నిర్మాణాలు

 అయితే నివాస గృహాలకు సైతం ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొత్తం 1,350 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న పరిపాలన, న్యాయ నగరాలకు 40 వేల టన్నుల సామర్థ్యం గల రెండు యూనిట్లు అవసరమ వుతాయని అంచనాలు రూపొందించారు. ముందుగా 20 వేల టన్నుల స్థాయిగల యూనిట్‌ని ఏర్పాటు చేసి అనంతరం 40 వేల టన్నుల సామర్ధ్యానికి పెంచేలా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఓ ప్రైవేటు సంస్థను ఈ ప్రాజెక్టు నిమిత్తం ఎంపిక చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టులైన నివాసాలకు సైతం డీసీఎస్‌ విధానంలోనే ఏసీ సదు పాయాన్ని అందించాలని సీఆర్డీఏ అధికారులు నిర్ణ యించారు. రాజధానిలో ప్రతి వాణిజ్య ప్రాంతానికి ఈ విధానంలోనే కూలింగ్‌ సౌకర్యం కల్పించాలని భావిస్తున్నారు.డీసీఎస్‌ వ్యవస్థ ఇలా.. నివాస గృహాల్లో వినియోగించే ఏసీల్లో ఒకటి లోపల వైపు, మరోకటి బయట వైపు ఏర్పాటు చేసు కునేలా ఉంటాయి. అయితే డీసీఎస్‌ (డ్రిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ సిస్టమ్‌) లో మొత్తం ఒకే యూనిట్‌ గా రూ పొందించనున్నారు. ప్రత్యేక పైపు లైన్లు ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి ఏసీని అందించాలన్నది ఈ డీసీఎస్‌ లక్ష్యం. భూగర్భంలో నిర్మించే పైపులైన్లు కోసం ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం ఉపయో గించనున్నారు. వినియోగదారుల ఇంటికి మీటర్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఆర్డీఏ వర్గాలు పేర్కొంటు న్నాయి. కాగా నివాసాల్లో బిగించిన మీటర్ల ద్వారా ఎంత మేర ఏసీని వినియోగించుకున్నామో లెక్కించి విద్యుత్తు మాదిరిగా ఏసీ బిల్లులను వసూలు చేయా లన్నది ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశ్యం. ప్రభుత్వం ఆశిస్తున్న ఈ వ్యవస్థ అందుబాటులోకి తీసుకెచ్చేం దుకు త్వరలోనే రెండున్నర ఎకరాల్లో ఏర్పాట్లు చేయనున్నట్లు సీఆర్డీఏ అధికారులు వెల్లడించారు.