కర్నూలు హైకోర్టు బెంచ్‌ మంజూరు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కర్నూలు హైకోర్టు బెంచ్‌ మంజూరు

కర్నూలు, ఫిబ్రవరి 19, (way2newstv.com)
రాయలసీమ చిరకాల వాంఛ హైకోర్టు బెంచ్‌ మంజూరు కానుంది. కర్నూలు పట్టణంలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తూ అధికారికంగా ప్రభు త్వం తొందరలోనే ఉత్తర్వులు జారీ చేయ నున్నట్లు తెలిసింది. ఉమ్మడి ఆంధ్రప్ర దేశ్‌లో హైదరాబాద్‌ కేంద్రంగా హైకోర్టు కార్యకలాపాలు నడుస్తున్న సమయంలోనే రాయలసీమ ప్రాంత ప్రజలు బెంచ్‌ కోసం ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. అప్పట్లో రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల నుంచి ప్రజల ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వాలు కూడా వెనుకడుగు వేయాల్సి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిలో హైకోర్టును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో బెంచ్‌ కోసం అక్కడి న్యాయవాదులు, ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆందోళన చేస్తున్నారు.


కర్నూలు హైకోర్టు బెంచ్‌ మంజూరు

అక్కడి వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం హైకోర్టు బెంచ్‌ని కర్నూలు పట్టణంలో ఏర్పాటుకు నిర్ణయించుకొని విధి విధానాలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. తొందరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. మరో పక్క, రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని హైకోర్టులోనే పిటిషన్ వేశారు. ఇప్పుడా పిటిషన్ కేంద్రం దగ్గరకు వెళ్లింది. కానీ కేంద్రం మాత్రం ఏమీ చెప్పకుండా నాన్చుతోంది. రాయలసీమలో ఏపీ హైకోర్టు బెంచ్ ఏర్పాటు పై కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని చెప్పాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. శ్రీభాగ్ ఒడంబడిక మేరకు రాయలసీమలో హై కోర్టును ఏర్పాటు చేయాలని అభ్యర్ధిస్తూ సీనియర్ న్యాయవాది జె.నారాయణ స్వామిలో 2017లో ఉమ్మడి హై కోర్టులో పిల్ దాఖలు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం రాజధాని ఆంధ్ర ప్రాంతంలో ఉన్నందున హై కోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని, ఆ మేరకు కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని ఆయన అభ్యర్ధించారు. కేసు విచారణ లో ఉండగానే అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు లో విచారణకు వచ్చింది. గతంలో కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్… ప్రత్యేకంగా ఔరంగబాద్ బెంచ్ ను ఏర్పాటు చేశారని పిటిషనర్ వాదించారు. ఆ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కి అధికారాలు ఉన్నాయని, సర్వోన్నత న్యాయస్థానం కూడా దీనిని సమర్ధించిందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కనీసం హై కోర్టు బెంచ్ అయినా రాయలసీమలో ఏర్పాటు చేయాలని అభ్యర్ధించారు. పిటిషనర్ వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం దీనిపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం ఏమిటో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. కాని కేంద్రం ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదు. అయితే ఈ కేసుతో సంబంధం లేకుండా, ఏపి ప్రభుత్వం మాత్రం, హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుకు పావులు కదుపుతుంది.