- ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు
రాజమండ్రి ఫిబ్రవరి 4 (way2newstv.com)
రాష్ట్రంలోని మహిళలంతా ఆర్ధిక శక్తిగా ఎదగాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచనలు చేస్తున్నారని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. స్థానిక 31వ డివిజన్‌లో జరిగిన రెట్టింపు పెన్షన్లు, పసుపు - కుంకుమ పథకం చెక్కుల పంపిఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. మహిళలకు ఆర్ధిక భరోసా ఇచ్చే కార్యక్రమంలో భాగంగానే పసుపు - కుంకుమ పథకాన్ని అమలు చేస్తున్నారని వివించారు. మహిళా సంఘాలు వాటిని సద్వినియోగించుకుని కుటుంబ పోషణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నగరంలో 4200 మహిళా సంఘాల్లోని 45 వేల మంది సభ్యులకు పసుపు - కుంకుమ కింద గతంలో 10 వేలు ఇవ్వగా... మళ్లీ ఇప్పుడు మరో 10 వేల రూపాయలు ఇస్తున్నారన్నారు.
ఆర్ధిక శక్తిగా మహిళా సంఘాలు ఎదగాలి
అలాగే 19200 మంది అర్హులైన పెన్షన్ దారులకు రెట్టింపు పెన్షన్లు అందిస్తున్నారని వివరించారు. రాష్ట్ర ప్రజల బాగోలు కోసం ముందు చూపుతో ఆలోచనలు చేస్తున్న చంద్రబాబునాయుడి ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర ప్రజలంతా ఆనందంగా ఉన్నారన్నారు. మహిళలందరికీ ఆర్ధిక స్వేచ్ఛ వచ్చిందన్నారు. మహిళలు ఆర్ధికంగా నిలదొక్కుకోవాలనే లక్ష్యంలో 1996లోనే చంద్రబాబునాయుడు డ్వాక్రా మహిళా సంఘాలను తీసుకువచ్చారన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు వారి భర్తలు ప్రోత్సాహం అందించాలన్నారు. అనంతరం మహిళా సంఘాలక గ్రూపులకు పసుపు - కుంకుమ కింద మంజూరైన చెక్కులను స్వీట్లు తినిపించి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసు అందించారు. అలాగే నగరంలో 1, 9, 10, 12, 35, 36, 42 డివిజన్లలో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వెంట్రప్రగడ గణపతి (అక్కు) మాలే విజయలక్ష్మి, తలారి భాస్కర్, మాజీ కార్పొరేటర్ నల్లా రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Andrapradeshnews