ఇద్దరూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇద్దరూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు

విజయవాడ,ఫిబ్రవరి 18, (way2newstv.com)  
ఐదు ఏళ్లకు ఒకసారి ఎన్నికలు పెట్టేదానికంటే ,ఏడాదికోసరి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది. నాలుగేళ్లు కార్పొరేట్ లకు ఊడిగం చేసి ఎన్నికలు సమీపిస్తుండగా రైతుల పై ప్రేమ చూపిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.  రైతులకు 6 వేల రూపాయాలు పెట్టుబడి మూడు దఫాలుగా ఇస్తామంటున్నారు. ప్రధాని మోడీ ఎన్నికల్లో ఓట్లు పొందడమే ధ్యేయం పని చేస్తున్నారు.  కేసీఆర్ కాపీ కొడుతున్నారు మోడీ ,చంద్రబాబు. పసుపు కంకుమ లో 10 వేలు ఇచ్చేది ఒకేసారి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. 


ఇద్దరూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు

బిసి లు ఓట్లు చంద్రబాబు, జగన్ లకు ఎన్నికల సమయంలోనే గుర్తొస్తున్నాయి. గర్జన, జయహో బిసి సభలు నిర్వహించి బిసి లకు వరాలు కురిపిస్తున్నారు. రాజ్యసభలో ఇరుపార్టీ లు ఒక్క బిసి కైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. జగన్ ఒక కులానికి రాజ్యసభ సీట్లు ఇచ్చారు. వైకాపా 13 జిల్లాల సమన్వయ కర్తలు అందరూ తన సామాజిక వర్గానికె ఇచ్చారు. బిసి లు పనికిరారు. చంద్రబాబు, జగన్ లకు బిసి ల గురించి మాట్లాడే నైతిక హక్కులేదు. వైకాపా లో ధర్మాన, పార్థసారథి,బొత్స లు పనికి రారా సమన్వయ కర్తలుగా అని ప్రశ్నించారు. పొరపాటున అధికారంలోకి వస్తే జిల్లాల వారీగా పంచుకుని తినేస్తారు. చంద్రబాబు, జగన్ ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తున్నారు,కనీసం పార్టీ మారే వాళ్ళకైనా బుద్ధి ఉండాలని అన్నారు. సామాజిక న్యాయం జరగాలంటే చంద్రబాబు, జగన్ లు ఇద్దరు దిగిపోవాలని అయన అన్నారు.