లక్ష్మీస్ ఎన్టీఆర్ కు కొత్త చిక్కులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

లక్ష్మీస్ ఎన్టీఆర్ కు కొత్త చిక్కులు

హైద్రాబాద్, ఫిబ్రవరి 11 (way2newstv.com)
ఎన్టీఆర్ బయోపిక్ లో ఆల్రెడీ ఒక పార్టు వచ్చేసింది. కథానాయకుడు ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు రెండో పార్టు మహానాయకుడు రాబోతుంది. దీనిపై ప్రేక్షకుల్లో ఎటువంటి అంచనాలు లేవు. కానీ వర్మ దీనికి కౌంటర్ గా తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ కు మాత్రం మంచి క్రేజ్ ఏర్పడింది.అయితే గత కొన్ని రోజులు నుండి ఈసినిమా పై ఓ రేంజిలో డిస్కషన్ స్టార్టైంది. 


లక్ష్మీస్ ఎన్టీఆర్ కు కొత్త చిక్కులు

కేవలం పోస్టర్స్ తో, సోషల్ మీడియా పోస్ట్స్ తో ఈసినిమాను బిజినెస్ చేయాలనీ చూసాడు డైరెక్టర్ వర్మ. ఈమూవీ కి మొత్తం థియేట్రికల్ రైట్స్ ఏకంగా 25 కోట్లు ఇస్తాం అని ముందుకు వచ్చారట. ఐతే ఈచిత్రం తీసుకున్న తరువాత దీన్ని విడుదల చేయకుండా చూడాలని వారి ప్లాన్ అంట. ఈ విషయం ఆ చెవిన, ఈ చెవిన పడి చివరికి వర్మ చెవిన పడింది.అందుకే ఈసినిమా యొక్క బిజినెస్ విషయంలో వర్మ ఆచి , తూచి అడుగులు వెయ్యాలని ఫిక్స్ అయ్యారట. టీజర్ రిలీజ్ చేసి రెస్పాన్స్ ఎలా ఉందొ చూసి అప్పుడు బిజినెస్ ను పెంచుదాం అని వర్మ ప్లాన్ అంట. దానికి తోడు వివాదాలు కూడా ఈ సినిమాకు ఎప్పటిలాగే ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడుతున్నాయి. మరి వర్మ బిజినెస్ ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూద్దాం