హైద్రాబాద్, ఫిబ్రవరి 11 (way2newstv.com)
ప్రముఖ టీవీ చానెల్‌లో ప్రసారమైన ‘పెళ్లి చూపులు’ రియాల్టీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న జ్ఞానేశ్వరి కందిరేగులా మళ్లీ వైరల్ అవుతోంది. అయితే, ఈసారి ప్రదీప్‌తో పెళ్లి వార్తతో కాదు.. ముద్దులతో హీటెక్కిస్తున్న ‘మిస్టర్ & మిస్’ టీజర్‌తో!
‘పెళ్లి చూపులు’ జ్ఞానేశ్వరి.. ముద్దులతో హీట్ పెంచేస్తోంది!
‘పెళ్లి చూపులు’ షోలో ప్రదీప్ మనసు గెలుచుకున్న జ్ఞానేశ్వరి వ్యక్తిగత జీవితంపై మొన్నటి వరకు వార్తలు హల్‌చల్ చేశాయి. ఆమె నటించిన పలు షార్ట్ ఫిల్మ్‌లకు వ్యూవర్స్ కూడా పెరిగారు. అయితే, జ్ఞానేశ్వరి ప్రదీప్‌ను పెళ్లి చేసుకుంటుందా లేదా అనే సంగతి పక్కన పెడితే.. ఆమె నటిస్తున్న ‘మిస్టర్ & మిస్’ సినిమా మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది.
Tags:
entertainment