వాళ్లకి ప్రజలే బుద్ది చెపుతారు

కాకినాడ, ఫిబ్రవరి 15 (way2newstv.com)  
ఎన్నికలు వచ్చే సరికి సీట్లు కోసం పార్టీలు మారే రాజకీయ నేతలకు ప్రజలే తగిన బుద్ది చెపుతారని హోంమంత్రి చినరాజప్ప అన్నారు.


 వాళ్లకి ప్రజలే బుద్ది చెపుతారు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన అవకాశంతో ప్రజా ప్రతినిదుల హోదాలో ఐదేళ్ల పాటు పదవులను అనుభవించిన నేతలు ఎన్నికల్లో తాయిళాలకు అమ్ముడుపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.ఆమంచి కృష్ణ మోహన్,ఎంపి అవంతి శ్రీనివాస్ కేవలం సీట్లు కోసమే పార్టీ మారారని అన్నారు.టిడిపి ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలను సంక్షేమ పధకాలుగా ప్రజలకు అందిస్తున్న చంద్రబాబుకు వచ్చె ఎన్నికల్లో ప్రజల మద్దతు ఉంటుందని అన్నారు.
Previous Post Next Post