ముఖ్యమంత్రి కేసీఆర్, కొప్పుల చిత్రపటాలకు పాలభిషేకం. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ముఖ్యమంత్రి కేసీఆర్, కొప్పుల చిత్రపటాలకు పాలభిషేకం.

జగిత్యాల ఫిబ్రవరి 21 (way2newstv.com):
దివ్యాంగుల ఆశాజ్యోతి ,విశాలమైన హృదయం కలిగిన నేత రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆన్నఆని తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల నెట్వర్క్ సమన్వయకర్త లంకదాసరి శ్రీనివాస్ ఆన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని తహశీల్దార్ చౌరస్తా వద్ద దివ్యాంగుల నెట్వర్క్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ,రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ల చిత్రపటాలకు పాలభిషేకం చేశారు.ఆనంతరం కశ్మీర్ లో ఉగ్రవాదులు దాడిలో మృత్యువాత పడ్డ అమరవీరులైన జవానులకు స్మరిస్తూ పట్టణంలో ని ఆర్డీవో కార్యాలయం నుండి తహశీల్దార్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అమరవీరులకు నివాళులు అర్పించారు.


ముఖ్యమంత్రి కేసీఆర్, కొప్పుల చిత్రపటాలకు పాలభిషేకం.

ఈసందర్భంగా రాష్ట్ర సమన్వయ కర్త లంకదాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ కొప్పుల ఈశ్వర్  శాసనసభ్యులుగా ఉన్నప్పటినుండి తన సొంత ఖర్చులతో దివ్యాంగులకు సంక్షేమం కోరకు పరికరాలు, ఉపకరణాలు, బస్సులు సౌకర్యం కల్పించి, దివ్యాంగులకు అండగా ఉన్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల నెట్వర్క్ రాష్ట్ర సమన్వయకర్త బండి సత్యనారాయణ, రాష్ట్ర దివ్యాంగుల జేఏసీ ఉపాధ్యక్షులు ధర్మపురి, మండల దివ్యాంగుల నెట్వర్క్ కోశాధికారి ధ్యాన వేణి కొమురయ్య, గొల్లపెల్లి మండల నెట్వర్క్ అధ్యక్షులు తాండ్ర రాజయ్య ,పెగడపల్లి మండలం దివ్యాంగుల నెట్వర్క్ అధ్యక్షులు బెదిగం రాజు , రాజు బేతప్ప,అస్గర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు