ఇమ్రాన్ ఖాన్ కు చంద్రబాబుకు తేడా ఏముంది - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇమ్రాన్ ఖాన్ కు చంద్రబాబుకు తేడా ఏముంది

రాజమహేంద్రవరం సభలో అమిత్ షా కామెంట్స్
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 21,(globalmedianews.com):
పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రవాదులు మన సైనికులను మట్టుబెట్టుకున్నారు. సైనికుల కుటుంబాలకు తోడుగా ఉన్నాం. 
ఐదేళ్లుగా దేశాన్ని సురక్షితంగా ఉంచామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. గురువారం రాజమహేంద్రవరం లో జరిగిన శక్తి సభలో అయన ప్రసంగించారు. తీవ్రవాదుల ఆట కట్టించాం. పుల్వామా తర్వాత కూడా సైనికులకు అండగా ఉండి, తీవ్రవాదులపై చర్యలకు తోడుగా ఉంటామని మోడీ చెప్పారు. మోడీ రోజుకి 17నుంచి 18 గంటలు దేశం కోసం కష్టపడుతున్నారని అన్నారు. 


ఇమ్రాన్ ఖాన్ కు చంద్రబాబుకు తేడా ఏముంది

కాంగ్రెస్ నేతలు మాత్రం విమర్శలు చేస్తున్నారు. సిద్ధు లాంటి వాళ్ళు పాకిస్తాన్ కి మద్దతుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశం సైనికుల ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. నెహ్రూ కారణంగానే కాశ్మీర్ సమస్య ఏర్పాడిందని అన్నారు. పటేల్ ప్రధాని అయ్యి ఉంటే హైదరాబాద్ మాదిరిగానే కాశ్మీర్ సమస్య పరిష్కారం అయ్యేది. పాకిస్తాన్ తీవ్రవాదులకు మోడీ జవాబిస్తారు. చంద్రబాబు వ్యాఖ్యలు విడ్డురం. చంద్రబాబు కి పాకిస్థాన్ ప్రధాని మీద విశ్వసనీయత ఉంది గానీ, మన ప్రధాని మీద లేకపోవడం విచారకరమని అన్నారు. బీజేపీ, మోడీ దేశభక్తి ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు. 
చంద్రబాబు ఏపీలో ఎప్పుడు ఉంటారు తెలియడం లేదు. ఒకరోజు ఢిల్లీలో, మరోరోజు కోల్ కతా, కర్ణాటక వెళుతూ ధర్నాలు చేస్తున్నారు. చంద్రబాబు ఎక్కడికో వెళ్లి ధర్నా చేయడం కాదు ఎపి ప్రజలను వంచించినందుకు టీడీపీ ఆఫీసు ముందు ధర్నా చేయాలని అన్నారు.  ఇమ్రాన్ ఖాన్ మాటలకు, చంద్రబాబు కి తేడా ఏముందని ప్రశ్నించారు.