ఏమంత్రి కి చీర కట్టి మహిళ మంత్రిగా చూపెడుతారు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏమంత్రి కి చీర కట్టి మహిళ మంత్రిగా చూపెడుతారు

 కాంగ్రెస్ మహిళ అధ్యక్షులు నెరేళ్ల శారద
హైదరాబాద్ ఫిబ్రవరి 20(way2newstv.com): 
మహిళలకు  మంత్రి పదవి ఇవ్వడం పై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని మహిళలకు క్షమాపణ చెప్పాలని  కాంగ్రెస్ మహిళ అధ్యక్షులు నెరేళ్ల శారద డిమాండ్ చేసారు. టిఆర్ఎస్ ప్రభుత్వం లో మహిళలు మంత్రులుగా పనికి రా రా అని ప్రశ్నించారు. మహిళా మంత్రిని నియమిస్తామంతున్న మీ మంత్రులలో ఏమంత్రి కి చీర కట్టి మహిళ  మంత్రిగా చూపెడుతారని శారద ప్రశ్నించారు.


ఏమంత్రి కి చీర కట్టి మహిళ  మంత్రిగా చూపెడుతారు

మహిళను అవమానించినందులకు గాను టిఆర్ఎస్ లో ఉన్న నలుగురు మహిళ ఎంఎల్ఏలు టిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేయాలన్నారు.బుదవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ   మహిళలు లేని మంత్రి వర్గం దేశంలో ఎక్కడ లేదన్నారు. బతుకమ్మ చీరలు ఇచ్చినప్పుడు కూడా మహిళలకు నాసిరకం చీరలు ఇచ్చి మహిళలను కించపరిచారని దుయ్యబట్టారు.టిఆర్ఎస్ ఎంపి కవితకు మహిళలకు సంబంధించి ఏ సమస్యల మీద పోరాటం చేసిందని అవార్డ్ ఇచ్చారని, బెస్ట్ పార్లమెంటరీ అవార్డ్ ఎలా వచ్చిందో అర్ధం కాలేదన్నారు. వాళ్ళ కుటుంబంలో ఉన్న మహిళలు  తప్ప వేరే మహిళలు  రాజకీయంగా ఎడగకూడదా అని శారద ప్రశ్నించారు.