ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం

రాజమహేంద్రవరం ఫిబ్రవరి 22  (way2newstv.com)
ప్రజల ఆరోగ్య భద్రత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కుల పంపిణి సందర్బంగా ఎక్స్ ప్రెస్ న్యూస్ ప్రతినిదితో మాట్లాడుతూ ఆరోగ్య పరంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేదన కుండా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజరు చేస్తున్నారని వివరించారు. అలాగే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిల్లో కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని అన్నారు. 


ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం

కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివ ద్ధి చేస్తున్నారని వివరించారు. అలాగే ఎక్కువ ఖర్చుతో కూడుకొన్న శస్త్ర చికిత్సలు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చేయించుకునే నిమిత్తం పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి నిధులు మంజూరు చేసి పేదలను ఆదుకుంటున్నారని వివరించారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ప్రజల కోసం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. రాజేంద్రనగర్‌కు చెందిన నల్లు మార్కండేయులుకు రూ. 30 వేలు, సారంగధర మెట్టకు చెందిన తిరగాటి అవినాష్‌కు రూ. 20 వేలు, రామదాసు పేటకు చెందిన షేక్‌ అమీద్‌షాకు రూ. లక్షా 10 వేలు, వర్కర్స్‌ కాలనీకి చెందిన జి వీరన్నకు రూ. 60 వేలు, సీతంపేటకు చెందిన చిన్ని రాంబాబుకు రూ. 36,870, మేదరపేటకు చెందిన నార్కేడ్‌మిల్లి అనిల్‌ ప్రసాద్‌కు రూ. 40 వేలు, గోదావరి గట్టుకు చెందిన అద్దంకి రాజశేఖర్‌కు రూ. 68 వేలు, అలాగే దొమ్మేటి కొండయ్య అనే వ్యక్తికి రూ. లక్షా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను వైద్యం నిమిత్తం చెక్కులు అందచేశారు.