అవంతి కోసం భీమిలీ త్యాగం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అవంతి కోసం భీమిలీ త్యాగం

 విశాఖపట్టణం, ఫిబ్రవరి 19 (way2newstv.com
టీడీపీ నుంచి ఎమ్మెల్యే ఆమంచి, ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇద్దరు నేతలు పార్టీని వీడటంతో టీడీపీ నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. నాలుగున్నరేళ్లు పార్టీలో కొనసాగి.. నమ్మక ద్రోహం చేశారంటూ మంత్రులు, నేతలు మండిపడుతున్నారు. తాజాగా అవంతి పార్టీ మారడంపై మంత్రి గంటా శ్రీనివాసరావు కాస్త ఘాటుగా స్పందించారు. 


 అవంతి కోసం భీమిలీ త్యాగం 

గతంలో వైసీపీ విమర్శించిన నోటితోనే.. ఇప్పుడు పొగడ్తలా అంటూ మండిపడ్డారు. ఉగ్రవాది కంటే జగన్ ప్రమాదకారి.. రాజకీయాల నుంచి బహిష్కరించాలన్న అవంతి వైసీపీ చేరడం విడ్డూరంగా ఉందన్నారు గంటా. చంద్రబాబును కాపు మిత్ర అంటూ పొగడ్తలు కురిపించి పాలాభిషేకం చేసిన వ్యక్తి.. ఇప్పుడు విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. తాను ప్రజారాజ్యంలోకి వెళ్లే ముందు చంద్రబాబును ఒక్క మాట కూడా అనలేదన్న మంత్రి.. కాంగ్రెస్ మంత్రిగా ఉంటూనే చంద్రబాబు తన రోల్‌ మోడల్‌ అని చెప్పానని గుర్తు చేశారు. పార్టీ మారిన తర్వాత అవంతి చేసిన విమర్శల్ని ప్రజలు హర్షించరన్నారు గంటా. భీమిలి టికెట్ కోసమే అవంతి పార్టీ మారారన్న ప్రచారంపై మంత్రి స్పందించారు. శ్రీనివాస్ కోసం తాను భీమిలి టికెట్ వదులుకునేందుకు సిద్ధమయ్యాయని చెప్పుకొచ్చారు. కులాల గురించి మాట్లాడే వైసీపీ.. 13 జిల్లాల పార్టీ ఇన్‌చార్జ్‌లంతా రెడ్డి సామాజికవర్గం వారిని ఎందుకు నియమించారని ప్రశ్నించారు.