25 రూపాయిలతో అన్నదానం చేసుకొనే అవకాశం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

25 రూపాయిలతో అన్నదానం చేసుకొనే అవకాశం

తిరుమల మార్చి 19, (way2newstv.com)
అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకే టీటీడీ శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందిస్తోంది. అయితే.. ఇకపై భక్తులు కూడా ఇందులో పాలుపంచుకునే గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. పెళ్లి రోజులు, పుట్టిన రోజులు జరుపుకునే వారు తిరుమలకు విచ్చేసే భక్తులకు అన్నదానం చేసే గొప్ప అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. ఒక్కో భక్తునికి 25 రూపాయల చొప్పున చెల్లిస్తే.. టీటీడీ వారి పేరు మీద అన్నదానం చేయనుంది. ఈ కార్యక్రమానికి వెయ్యి మందికి తగ్గకుండా.. అన్నదానం చేయాల్సి ఉంటుంది. స్వామివారి ప్రాంగణంలో ఇలాంటి గొప్ప అవకాశం కల్పించినందుకు భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీకి అయ్యే వ్యయాన్ని భరిస్తే.. వారి పేరును అన్నదానం చేసే కొత్త పథకాన్ని టీటీడీ ప్రవేశపెట్టింది. 


25 రూపాయిలతో అన్నదానం చేసుకొనే అవకాశం

తిరుమల కలియుగ వేంకటేశ్వరుడు కొలువుదీరిన స్థలం. ఇక్కడకు ప్రతిరోజు స్వామివారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. స్వామివారిని దర్శించుకునే భక్తులకు టీటీడీ ఉచితంగా అన్నదానం చేస్తోంది. తరిగొండ అన్నప్రసాద వితరణ కేంద్రంలోనే కాకుండా.. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌, క్యూలైన్లు, ఇంకా చాలా ప్రాంతాల్లో అన్నదానం, అల్పాహారాలు అందజేస్తోంది. అయితే.. ఈ కార్యక్రమాన్ని భక్తులు స్వామివారికి సమర్పించిన విరాళాలతో కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు అన్నదానం ట్రస్ట్‌కు భక్తులు సమర్పించిన విరాళాలు 800 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. వీటిపై వచ్చే వడ్డీతో ఈ కార్యక్రమం చేస్తున్నారు.ప్రతి యేటా అన్నప్రసాద నిర్వహణకు 85 కోట్లు వ్యయం అవుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. విరాళాలపై వచ్చిన వడ్డీ 65 కోట్లు మాత్రమే వస్తుండడంతో.. టీటీడీ నిధుల నుంచి 20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. విరాళాలు వెయ్యి కోట్లకు చేరుకుంటే.. ఈ భారం తప్పనుంది. ఇది తీరేందుకు మరో రెండేళ్లు పట్టే సమయం ఉంది. దీంతో టీటీడీ కొత్త ఆలోచన చేస్తోంది. టీటీడీ చేసే గొప్ప కార్యంలో అవకాశం కల్పించినందుకు టీటీడీకి భక్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.