ముచ్చెమటలు పోటిస్తున్న షెడ్యూలు
గుంటూరు, మార్చి 13, (way2newstv.com)
పోలింగ్ ప్రక్రియకు సరిగ్గా 28రోజులు మాత్రమే సమయం ఉండటం పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. అనూహ్యంగా చోటుచేసుకున్న ఈ పరిణామంతో సోమవారం ఒక్కసారిగా హడావిడి ప్రారంభమైంది. మరో వారం రోజుల్లోనే నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండటంతో పార్టీల అధినేతలు అభ్యర్థుల ఎంపికలో పూర్తిగా నిమగమైపోయారు. ఎన్నికల షెడ్యూల్ ఈ నెలలోనే విడుదలవుతుందని తెలిసినప్పటికీ ఈ కారణంగానే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను నాన్చుతూ వచ్చాయి. ఈ అంచనాకు భిన్నంగా షెడ్యూల్ రావడం, తొలి దశలోనే రెండు తెలుగురాష్ట్రాల్లోనూ ఒకే విడతలో పోలింగ్ నిర్వహించాలని ఇసి నిర్ణయించడం చర్చనీయాం శంగా మారింది. తెలుగుదేశం పార్టీ ఒకఅడుగు ముందుకేసి ఈ నిర్ణయం వెనుక కుట్ర ఉందని ఆరోపించింది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా జరుపతున్న సమావేశల్లో పలువురు అభ్యర్థులను టిడిపి అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. మరోవైపు రాజమండ్రిఎంపి మాగంటి మురళీమోహన్ తాను పోటీచేయబోనని చెప్పారు. ఏలూరు ఎంపి మాగంటి బాబు తనకు కైకలూరు సీటు కేటాయించాలని కోరుతున్నారు.
28 రోజుల్లో ఎన్నికలు....
మచిలీపట్నం ఎంపి కొనకళ్ల నారాయణరావు తనకు అసెంబ్లీ సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. విజయనగరం, విశాఖ, అరకు, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, నరసరావు పేట, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, రాజంపేట, కడప, కర్నూలు అభ్యర్థులపై ఇంకా నిర్ణయం ప్రకటించలేదు. విశాఖచెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు కూడా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. వైసిపి నుండి వచ్చి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలకు సంబంధించి సీట్లు కేటాయింపులో ఇంకా స్పష్టత రాలేదు. మంత్రి జవహర్, మాజీ మంత్రి పీతల సుజాత నియోజకవర్గాల్లో ఆందోళన ఎక్కువగా ఉంది. ఇతర నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలపై సిఎం ఇంటివద్ద చింతలపూడి సీటుపై పలువురు నినాదాలు చేశారు. పోలింగ్ తేది ముందుకు జరగడంతో వైసిసి అధినేత జగన్మోహన్‌రెడ్డి చేరికలపై దృష్టి సారించారు. రెండు మూడు రోజుల్లో ఈ ప్రక్రియను ముగించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. తాజాగా వివిధ జిల్లాల నేతలకు కూడా దీనిపైనే ఆదేశాలెఉవెళ్లినట్లు తెలిసింది. సోమవారం హైదరాబాద్‌లోని వైసిపి కార్యాలయంలో జగన్‌ను సినీ నటుడు ఆలీ, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సోదరుడు చంద్రశేఖర్ వైసిపిలోచేరారు. వీరిద్దరి చేరిక అనంతరం కాకినాడ సభకు జగన్ వెళ్లారు. ప్రకాశం జిల్లాకు చెందిన టిడిపి సీనియర్ నేత మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా వైసిపిలో చేరనున్నారని సమాచారం. చేరికల ప్రక్రియను రెండు, మూడు రోజుల్లో పూర్తిచేసి బస్సుయాత్రను ప్రారంభించాలని జగన్ భావిస్తున్నారు. రాజంపేట నుండి మిధున్‌రెడ్డి, కడప నుండి అవినాష్‌రెడ్డి, నెల్లూరు నుండి రాజమోహనరెడ్డి, తిరుపతి నుండి వరప్రసాదు, మచిలీపట్నం నుండి వల్లభనేని బాలశౌరి ప్రచారంలోకి వెళ్లిపోయారు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఒంగోలులో వైసిపి అభ్యర్థి వై.వి.సుబ్బారెడ్డి సిట్టింగు అయినప్పటికీ అక్కడ టిడిపి నుండి వచ్చే మాగుంట శ్రీనివాసులురెడ్డికి సీటు కేటాయించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కీలకమైన విజయవాడ, గుంటూరులో టిడిపి పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించినా, వైసిపి ఇంకా ముందడుగు వేయలేదు.ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో వెంటనే ప్రచారంలోకి వెళ్ళాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. మంగళవారం మరో విడత సమావేశం జరగనుంది. రాష్ట్రంలో జనసేన, వామపక్షాలకు ఆదరణ పెరుగుతోందని, ప్రజల్లో ఆ వాతావరణం కనపడుతోందని ఈ సమావేశంలో అభిప్రాయ పడ్డారు. ప్రచారంపై ఒకటి,రెండు రోజుల్లో ఉమ్మడి అవగాహన వస్తుందని నేతలు తెలిపారు.