మరింత తగ్గిన కూరగాయలు ధరలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మరింత తగ్గిన కూరగాయలు ధరలు

విశాఖపట్టణం, మార్చి 13, (way2newstv.com)
రైతు బజార్లలో కూరగాయల ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయి. కొన్నింటి ధరలు స్వల్ప స్థాయిలో పెరగ్గా మరి కొన్నింటి ధరలు స్వల్ప మొత్తంలో తగ్గాయి. గత వారం కిలో రూ.80గా ఉన్న అల్లం ధర ఈ వారం రూ.82కి చేరింది. బీన్స్‌ రూ.34 నుంచి రూ.42కి, తెల్ల వంకాయలు రూ.18 నుంచి రూ.22కి, నల్ల వంకాయలు రూ.18 నుంచి రూ.28కి, క్యాబేజీ రూ.9 నుంచి రూ.13కి, క్యారెట్‌ రూ.15 నుంచి రూ.24కి, చిక్కుడు కాయలు రూ.20 నుంచి రూ.26కి, దేవుడి చిక్కుడు రూ.20 నుంచి రూ.36కి, క్యాప్సికమ్‌ రూ.38 నుంచి రూ.48కి, కంద రూ.20 నుంచి రూ.22కి, చిలకడ దుంపలు రూ.18 నుంచి రూ.20కి, పచ్చి బఠాణి రూ.30 నుంచి రూ.36కి పెరిగాయి.ఇక ధరలు తగ్గిన వాటిలో దేశవాళీ ఉల్లి ఉంది. 


మరింత తగ్గిన కూరగాయలు ధరలు

దీని ధర రూ.9 నుంచి రూ.8కి తగ్గింది. బీరకాయలు రూ.44 నుంచి రూ.36కి, బెండకాయలు రూ.34 నుంచి రూ.32కి, కాకర కాయలు రూ.38 నుంచి రూ.34కి, చేమ దుంపలు రూ.24 నుంచి రూ.20కి, బంగాళ దుంపలు (కొత్తవి) రూ.10 నుంచి రూ.9కి, పాతవి రూ.8 నుంచి రూ.7కి, మిర్చి (తెలుపు) రూ.26 నుంచి రూ.20కి, మిర్చి (నలుపు) రూ.26 నుంచి రూ.24కి, దొండకాయలు రూ.24 నుంచి రూ.20కి, టమాటా రూ.14 నుంచి రూ.13కి, గోరు చిక్కుడు రూ.28 నుంచి రూ.26కి, కర్ర పెండలం రూ.18 నుంచి 16కి, బీన్స్‌ పిక్కలు రూ.50 నుంచి రూ.40కి, వెళ్ళుల్లి పాయలు రూ.60 నుంచి రూ.40కి తగ్గాయి. ధరల్లో ఎటువంటి మార్పు లేనివాటిలో బీట్‌ రూట్‌ రూ.20, కాలీఫ్లవర్‌ రూ.18, ఆగాకరకాయలు రూ.52, బరబాటి రూ.20, పొటల్స్‌ రూ.40, ఆనపకాయలు రూ.10, అరటి కాయ (పెద్దవి) రూ.6, చిన్నవి రూ.4, ముళ్ళంగి రూ.16గా ఉన్నాయి. డజను గుడ్లు రూ.56 నుంచి రూ.52కి తగ్గాయి.