కొలిక్కి వస్తున్న 9,10 షెడ్యూల్ సమస్యలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కొలిక్కి వస్తున్న 9,10 షెడ్యూల్ సమస్యలు

హైద్రాబాద్, మార్చి  27 (way2newstv.com)
సమైక్యాంధ్రప్రదేశ్‌ని విభజించి ఐదేళ్లవుతున్నా... ఇంకా విభజన సమస్యలు అలాగే ఉన్నాయి. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లో చెప్పిన ప్రభుత్వ సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, యూనివర్శిటీల్లో స్థిర, చరాస్తుల్ని తెలంగాణకు 48 శాతం ఏపీకి 52 శాతం కేటాయించుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయి. ప్రతి అంశాన్నీ ఎలాంటి గొడవలూ లేకుండా ప్రశాంతంగా పంచుకుందామని నిర్ణయానికి వచ్చాయి. కొన్నేళ్లుగా ఎటూ తేలకుండా ఉన్న స్థిర, చరాస్తులపై ఏపీ సీఎస్ అనిల్ చంద్ర, తెలంగాణ సీఎస్ ఎస్ కే జ్యోషి... సమావేశమై చర్చించారు. 

 
కొలిక్కి వస్తున్న 9,10 షెడ్యూల్ సమస్యలు

బుద్ధ పూర్ణిమ భవనంలో జరిగిన ససమావేశంలో ఆస్తుల పంపకాలపై ఓ గంటపాటూ చర్చించారు.వివాదాస్పదమైన ట్రాన్స్ కో, జెన్ కోల ఆస్తుల పంపకాలపై ప్రధానంగా చర్చ జరిగింది. రెండు సంస్థల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి, లెక్కలు తేల్చేయాలని ఇద్దరు సీఎస్‌లూ డిసైడయ్యారు. హైకోర్టుకు సంబంధించి లా బుక్స్ కీలకం కావడంతో... ఏపీ సీఎస్ అనిల్ చంద్ర దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఈ క్రమంలో హైకోర్టు ఆస్తులకు సంబంధించిన లెక్కలు తేల్చేసారు.చరాస్తులు, వాహనాలు, షెడ్డర్ మిషన్లు, ఫొటో కాపీయర్ మిషన్లు, పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్, పెడస్ట్రల్ ఫ్యాన్లు, ఎయిర్ కూలర్లు, టవర్ ఎయిర్ కండీషనర్లు, వివిధ రకాల ఫర్నిచర్, క్రౌన్ చైర్స్, సాఫ్ట్‌వేర్స్, ఇతర ఎక్విప్ మెంట్, డ్రింకింగ్ వాటర్ డిస్పెన్సర్లు, సెంట్రల్ లైబ్రరీలోని బుక్స్ వంటి వాటిని ప్రశాంతంగా పంచుకునేలా రెండు రాష్ట్రాల సీఎస్‌లు నిర్ణయం తీసుకున్నారు. అతి త్వరలోనే అన్ని లెక్కలూ తేల్చేయనున్నట్లు తెలిసింది.