విశాఖపట్టణం, మార్చి 28, (way2newstv.com)
యువతను రాజకీయంగా మంచిమార్గంలోకి మళ్లించాల్సిన బాధ్యత తనపై ఉందన్న ఉద్దేశంతో భారత్ మిసైల్‌మ్యాన్ అబ్దుల్‌కలాం స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ అన్నారు.
నా మేనిఫెస్టోను బాండ్ పేపర్‌పై రాసిస్తానని, నన్ను గెలిపించాక మాట తప్పితే ఎవరైనా నన్ను కోర్టుకు ఈడ్చవచ్చని తెలిపారు. నిన్న విశాఖలో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జనసేనలో చేరడం ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని, ఆ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచే పవన్ తో చర్చిస్తున్నానని తెలిపారు. తమతో చేతులు కలపాలని ఎన్నో పార్టీలు తనను ఆహ్వానించాయని, కానీ జీరో బడ్జెట్‌తో రాజకీయాలు చేసే వారితో కలవాలన్న ఉద్దేశంతోనే జనసేనలో చేరినట్లు స్పష్టం చేశారు