ఎనర్జిటిక్ స్టార్ రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్ హీరో హీరోయిన్స్‌గా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. ఈ సినిమా గోవా షెడ్యూల్ పూర్తయ్యింది.
నెల రోజులుగా గోవాలో ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీత సారథ్యం వహిస్తున్నారు.
ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో హీరో రామ్‌ను సరికొత్త కోణంలో చూపించబోతున్నారు.
పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మాతలు మారి రూపొందిస్తున్న ఈ సినిమాను వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్, పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రియల్ సతీష్, సాహిత్యం: భాస్కరభట్ల, ఎడిటర్: జునైద్ సిద్ధికీ, ఆర్ట్: జానీ షేక్, సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, మ్యూజిక్: మణిశర్మ, నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, దర్శకత్వం: పూరి జగన్నాథ్.