శంషాబాద్ ఎయిర్‌పోర్టులోకి సందర్శకుల ప్రవేశం రద్దు

హైదరాబాద్, మార్చి 2, (way2newstv.com)
శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి సందర్శకుల ప్రవేశాన్ని అధికారులు రద్దు చేశారు. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా సందర్శకులకు అనుమతి నిరాకరించినట్లు తెలస్తోంది. అలాగే ప్రయాణికులు కూడా ముందుగానే రిపోర్టు చేయాలని విమానాశ్రయం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 


శంషాబాద్ ఎయిర్‌పోర్టులోకి సందర్శకుల ప్రవేశం రద్దు

ప్రస్తుతం భారత్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డ దృష్ట్యా దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. దీనిలో భాగంగా శంషాబాద్‌లోగల ఎయిర్‌పోర్టులో కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేయడమేగాక సందర్శకుల ప్రవేశాన్ని రద్దు చేశారు.
Previous Post Next Post