వైల్డ్ లైఫ్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ కు రావాలంటూ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి ఆహ్వానం

మంత్రిని ఆహ్వానించిన  బ్లూ క్రాస్ సంస్థ వ్యవస్థాపకురాలు అక్కినేని అమల
ఈ నెల 8 నుంచి 10 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న వైల్డ్ లైఫ్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ 
హైద‌రాబాద్, మార్చి 2(way2newstv.com)
వన్యప్రాణులు, అట‌వీ సంరక్షణకు తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తున్న కృషిని బ్లూ క్రాస్ సంస్థ వ్యవస్థాపకురాలు, ప్రముఖ నటీమణి అక్కినేని అమల ప్ర‌శసించారు. అన్న‌పూర్ణ స్టూడియోలో ఈ నెల 8 నుంచి 10వ తేది వ‌ర‌కు జ‌రిగే ఇంట‌ర్నేష‌న‌ల్ వెల్డ్ లైఫ్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ కు రావాలంటూ అట‌వీ, ప‌ర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని బ్లూ క్రాస్ సంస్థ వ్యవస్థాపకురాలు, ప్రముఖ నటీమణి అక్కినేని అమల ఆహ్వానించారు. 


 వైల్డ్ లైఫ్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ కు రావాలంటూ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి ఆహ్వానం

ఈ సంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ...  హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటడం, వన్యప్రాణుల పరిరక్షణకు సీయం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను కొనియాడారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల నుంచి పెద్దపులులు ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లోని అడవులకు వలస వస్తున్నాయని, వాటి సంర‌క్ష‌ణ‌కు మ‌రిన్నిచ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఈ సంద‌ర్బంగా  హైటికోస్ సంస్థ ఆద్వ‌ర్యంలో పులుల సంర‌క్ష‌ణ‌కు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ఆమె మంత్రికి వివ‌రించారు
Previous Post Next Post