బిజెపి అభ్యర్థి కె.ఆర్ మురహరి రెడ్డి
ఎమ్మిగనూరు, మార్చి12: (way2newstv.com)
రానున్న ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా ఉండడానికి ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధిని చేసి చూపిస్తానని బిజెపి అభ్యర్థి కె.ఆర్ మురహరి రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పట్టణంలోని 3వ వార్డులో భాజాపా నాయకులు కె.ఆర్.మురహరి రెడ్డి బిజెపి అభ్యర్థిగా తమ నాయకులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతము ఉన్న ప్రభుత్వము ప్రవేశ పెట్టిన పథకాలు భాజపా నుండి కాపీ కొట్టినవి అని అన్నారు.
క్కఅవకాశాన్ని ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా..
పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లాలంటే తెలుగు తమ్ముళ్లకు కమిషన్ ఇవ్వాల్సిందేనని, లేకపోతే ప్రజలకు చేరకుండా అడ్డుపడుతున్నారని అన్నారు. పెన్షన్లు ఇవ్వాలంటే కమీషన్, మరుగుదొడ్లు కట్టించాలంటే కమిషన్, ప్రధానమంత్రి అవాస్ యోజన క్రింద ఇల్లు కట్టించు కోవాలంటే కౌన్సిలర్లు కు కమిషన్, ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వం తో విసిగిపోయారని,ఈ అవినీతి ఎమ్మెల్యేను సాగనంపే సమయం ఆసన్నమైందని వారన్నారు. ప్రజలు మార్పు కోసం నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే నేను ఇక్కడున్న విద్యావంతులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని,అలాగే చేనేతలను ఆదుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు యు.జి.ప్రకాష్,3 వార్డు ఇంఛార్జి ఇంతియాజ్, శశి, కె.పి.ఉరుకుందు, కె.వీరారెడ్డి, కిరణ్, జయప్రకాష్, చరణ్, రవి, మల్లికార్జున, శివ, గెడ్డయ్య,పాల్గొన్నారు.