నెల్లూరు లోక్ సభ వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి
నెల్లూరు, మార్చి 27, (way2newstv.com)
గత ఐదేళ్లుగా నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం ప్రభుత్వం సాగు తాగునీరు ఇవ్వలేకపోయిందని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు కలిగిరి మండలంలోని దూబగుంట కృష్ణారెడ్డి పాలెం ల్లో ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లతో కలిసి జరిపిన రోడ్ షో లో ఆయన మాట్లాడారు మన జిల్లాలో గత మూడేళ్లుగా సరైన వర్షాలు లేక పంటలు పండలేదు. తెలుగు దేశం ప్రభుత్వం రైతులపై శ్రద్ధ పెట్టలేదని ఆరోపించారు. పండిన పంటకు సైతం గిట్టుబాటు లభించలేదని దీనికి కారణం మంత్రి సోమిరెడ్డి రైస్ మిల్లర్ల వద్ద లంచాలు తీసుకోవడమే అని విమర్శించారు .
ఐదేళ్లుగా ప్రభుత్వం నీరు ఇవ్వలేకపోయింది
చంద్రబాబు సోమిరెడ్డిలు కలిసి జిల్లాను నాశనం చేశారని పేర్కొన్నారు బాబు పాలనలో వర్షాలు పడవు అని విమర్శలు నిజమయ్యాయని గత మూడేళ్ల ను పరిశీలిస్తే ఇదే విషయం అర్థం అవుతుందన్నారు చంద్రబాబు చేసిన వాగ్దానాలను కూడా సక్రమంగా అమలు చేయలేదని ఆరోపించారు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన వాగ్దానాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని పేర్కొన్నారు పాదయాత్రతో కష్టనష్టాలు తెలుసుకున్న జగన్ పాలన రావాలంటే మీరంతా ఓటు వేయాలని మమ్మల్ని గెలిపించాలని కోరారు వైయస్ హయాంలో అమలు చేసిన పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని గుర్తు చేశారు జగన్ కాలంలో ప్రజలకు మరింత మేలు జరగనుందని అభివర్ణించారు ఈ కార్యక్రమంలో మల్లు సుధాకర్ రెడ్డి పాముల హరి నరసింహారావు స్టానిక నేతలు తదితరులు పాల్గొన్నారు