గొల్లపూడి, మార్చి 14, (way2newstv.com)
మంత్రి దేవినేనీ ఉమా సోదరుడు దేవినేనీ చంద్రశేఖర్ తో కలిసి గొల్లపూడి గ్రామంలో గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమం వైకాపా అభ్యర్ధి వసంత కృష్ణ ప్రసాదు నిర్వహించారు. మాలపల్లి, ఇందిరమ్మ నగర్, హరిజనవాడ, రజక బజారు ప్రాంతం లో గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిద్దరూ నవరత్నాలను గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ
ఒక్క సారి ఆలోచించండి అవకాశం ఇవ్వండి. మైలవరం ఎమ్మెల్యే గా కృష్ణ ప్రసాదు ని గెలిపించుకుందాం అభివృద్ధి పదంలో ముందుకు సాగుదామని అన్నారు. మైలవరం నుంచి ఎమ్మెల్యేగా మంత్రి గా అవకాశం ఇచ్చ నా దేవినేనీ ఉమా, ఇక్కడ ప్రజలకు చేసిందేమీ లేదని వసంత కృష్ణ ప్రసాదు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. పేదలకు న్యాయం జరుగుతుందని అయన అన్నారు.
గొల్లపూడి లో రావాలి జగన్ కావాలి జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇవ్వాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి కృష్ణ ప్రసాదు గారిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గొల్లపూడి ప్రజల అండ చూసుకుని మైలవరం ప్రాంతం లో ఇష్టారాజ్యం పకృతి సంపదను యధేచ్ఛగా గా దోచుకుంటున్న మంత్రి దేవినేనీ ఉమా కు తగిన బుద్ధి చెప్పాలని చంద్రశేఖర్ అన్నారు. కృష్ణ ప్రసాదు మాట్లాడుతూ మంత్రి దేవినేనీ ఉమా దోపిడీ కి అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆరోపించారు. తన మన భేధం మరిచిపోయిన మంత్రి దేవినేనీ ఉమా చివరకు కుటుంబ సభ్యులను తన సోదరులు దేవినేనీ వెంకట రమణ సోంత మనుషులను కూడా మరిచిపోయారని అన్నారు. తన సోంత కోటరీ ఏర్పాటు చేసుకుని గడిచిన దశాబ్ద కాలంగా యధేచ్ఛగా దోచుకుంటున్నారని విమర్శించారు. మైలవరం నియోజకవర్గం లో ఇసుక క్వారీలు, గ్రావెల్ క్వారీలు మైనింగ్ మాఫియా, నీరు మట్టి లో దోపిడీ, మధ్యం మాఫియా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లపూడి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.