హైదరాబాద్, (way2newstv.com)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ అసెంబ్లీలోని కమిటీ హాల్-1లో జరిగింది. ఐదు స్థానాల కోసం ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి గూడూరి నారాయణరెడ్డి పోటీలో ఉన్నప్పటికీ.. ఈ ఎన్నికలను ఆ పార్టీ బహిష్కరించింది.
ఓటు హక్కును వినియోగించుకున్న కేసీఆర్
దీంతో టీఆర్ఎస్ అభ్యర్థులు నలుగురు, మజ్లిస్ అభ్యర్థి ఎన్నిక లాంఛనమే కానుంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు అసెంబ్లీకి బస్సులో బయలుదేరారు. మంగళవారం ఉదయం కుడా ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించిన మాక్ పోలింగ్ తెలంగాణ భవన్ లో నిర్వహించారు. అనంతరం ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎమ్మెల్యేలందరూ బస్సులో బయలుదేరగా అదే బస్సులో కేటీఆర్ కూడా వచ్చారు.