ములుగు మార్చి19 (way2newstv.com):
పార్లమెంట్ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రతి ఓటరుకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వివి ప్యాట్,ఈవిఎంలు ఎలా పని చేస్తాయో, వాటిపై ప్రజలకు ఉన్న అనుమానాలను తొలగించే విధంగా వివరిప్తున్నారు సెర్ప్ సిబ్బంది.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పద్దతి ద్వారా ఓటర్లకు అవగాహన కల్పిస్తున్న సెర్ప్ సిబ్బంది
గతవారం రోజులనుండి ములుగుమండలలోని పలుగ్రామాల్లో సెర్ప్ ఉగ్యోగులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మీద అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తున్నారు. మంగళవారంరోజున అంకన్నాగూడెం గ్రామంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మీద ఓటర్ల కు సెర్ప్ సిబ్బంది ఎపియం వేణుగోపాల్ రావు సిసి చంద్రమోగిలి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సిబ్బంది సి సి లతో పాటు వివోఏ లు రమేష్ .జయప్రద ఓటర్లు తదితరులు పాల్గొన్నారు.