ఎన్నికల శిక్షణకు గైర్హాజరైనవారికి షోకాజు నోటీసులు - దానకిషోర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎన్నికల శిక్షణకు గైర్హాజరైనవారికి షోకాజు నోటీసులు - దానకిషోర్

హైదరాబాద్, మార్చి19 (way2newstv.com): 
 పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు గాను హైదరాబాద్ జిల్లాలో 17, 18 తేదీలలో నిర్వహించిన శిక్షణకు హాజరుకాని ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు షోకాజు నోటీసులు జారీచేస్తున్నట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ ఎం.దానకిషోర్ తెలియజేశారు. హైదరాబాద్ జిల్లాలో పిఓ, ఏపిఓ విధులు నిర్వహించడానికి మొత్తం 10వేల మంది ఉద్యోగులకు ఎన్నికల విధుల ఉత్తర్వులు జారీచేయగా 17, 18 తేదీలలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి 7వేల మందికి పైగా మాత్రమే హాజరయ్యారని, గైర్హాజరైనవారికి నోటీసులు జారీచేశామని తెలిపారు. 


ఎన్నికల శిక్షణకు గైర్హాజరైనవారికి షోకాజు నోటీసులు - దానకిషోర్

17, 18 తేదీలలో హాజరుకాని ఉద్యోగులకు మరో అవకాశంగా ఈ నెల 22వ తేదీన సికింద్రాబాద్ హరిహరకళాభవన్ లో మరోసారి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల శిక్షణకు హాజరుకానివారు 22వ తేదీన తప్పనిసరిగా హాజరుకావాలని అన్నారు. ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జీహెచ్ఎంసీ కార్యాలయానికి వస్తున్నారని, ఎట్టిపరిస్థితులోనూ మినహాయింపు కుదరదని స్పష్టం చేశారు. ఎన్నికల విధులకు హాజరుకానివారిపై ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం కఠిన చర్యలు చేపట్టనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి ఓ ప్రకటనలో తెలిపారు.